మెగా మేనల్లుడు సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ బ్యాక్ టు బ్యాక్ మూవీస్ ని లైన్ లో పెట్టారు. `ప్రతి రోజు పండగే` తరువాత ఇంట్రెస్టింగ్ మూవీస్ ని ఎంపిక చేసుకుంటున్న సాయిధరమ్ తేజ్ ఈ నెల 25న `సోలో బ్రతుకే సోబెటర్` మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇదిలా వుంటే ఇప్పటి వరకు తన వయసుకి తగ్గ పాత్రల్లో నటించి ఆకట్టుకున్న ఈ మెగా హీరో తాజాగా ఓ పొలిటికల్ థ్రిల్లర్ లో నటిస్తున్నారు.
దేవా కట్టా తెరకెక్కిస్తున్న ఈ మూవీ సమకాలీన రాజకీయ అంశాల నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఈ మూవీ ద్వారా బలమైన సందేశాన్ని కూడా అందించబోతున్నారు. ఇందులో సాయిధరమ్ తేజ్ పాత్ర చాలా కొత్తగా పరిణతితో వుంటుందని తెలుస్తోంది. ఈ చిత్రానికి `రిపబ్లిక్` అనే టైటిల్‌ని అనుకుంటున్నారట. లాక్ డౌన్ తరువాత సినిమాల షూటింగ్ లు మొదలైన విషయం తెలిసిందే. ఇదే సమయంలో సాయి ధరమ్ తేజ్ మూవీ కూడా స్టార్టయింది.
ఇప్పటి వరకు 60 శాతం షూటింగ్ పూర్తయింది. ఇందులో సాయిధరమ్ తేజ్ యువ ఐఎఎస్ అధికారి పాత్రలో నటిస్తున్నారు. కొల్లెరు గురించి ఇందులో చర్చిన్నారు. ఇందు కోసం కొంత భాగాన్ని ఏలూరులో చిత్రీకరించారట. ఈ చిత్రంలో రమ్య కృష్ణ పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నారట. సమ్మర్ లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీ తరువాత కార్తీక్ దండు దర్శకత్వంలో సాయి ధరం తేజ్ మరో చిత్రం చేయబోతున్నారు. ఇది వచ్చే ఏడాది ప్రారంభం అవుతుంది. ఈ మూవీ కూడా కొత్త నేపథ్యంలో వుంటుందని తెలిసింది.