సినిమా తలరాత మార్చే సీన్ అదే..!

లేటెస్ట్ గా సినిమా సక్సెస్ పై తన మార్క్ కామెంట్స్ చేశారు ప్రముఖ రైటర్ కోనా వెంకట్.

Update: 2024-11-14 00:30 GMT

ఒక సినిమా హిట్టు సూపర్ హిట్ అవ్వడానికి లెక్కలు వేసుకుని చెప్పడం కష్టం. స్టార్ సినిమాల విషయాల్లో కూడా ఎంతో కష్టడి చేసిన సినిమాలు నిరాశ పరిస్తే.. కొద్దిపాటి ఎఫర్ట్స్ తో చేసిన సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అవుతాయి. ఐతే ఆడియన్స్ ఒక సినిమాను ఎలా రిసీవ్ చేసుకుంటారు అని చెప్పడం కష్టం. దీనిపై రైటర్లు, దర్శకులు తమ అభిప్రాయాన్ని చెబుతూనే ఉంటారు. లేటెస్ట్ గా సినిమా సక్సెస్ పై తన మార్క్ కామెంట్స్ చేశారు ప్రముఖ రైటర్ కోనా వెంకట్.

సినిమా కథలు ఎంత్ర స్ట్రాంగ్ గా ఉన్నా కూడా అవి బ్లాక్ బస్టర్ గా మారే ఛాన్స్ లేదని కోనా వెంకట్ అన్నారు. ఐతే ఆయన అలా అనడం వెనక రీజన్స్ ఏంటన్నది చూస్తే.. ఏదైనా ఒక సినిమా వర్క్ అవుట్ అవ్వాలంటే అందులో ఎమోషన్ బాగా పండాలి. అది ఎలాంటి ఎమోషన్ అయినా సరే అది ప్రేక్షకుడిని కదిలించాలి. మదర్, ఫాదర్, బ్రదర్, సిస్టర్ ఇలా ఎలాంటి ఎమోషన్ అయినా ఆడియన్స్ కు టచ్ అయితే చాలు అలా వారిని సీట్లలో కూర్చునేలా చేస్తుందని అన్నారు. అలా ఎమోషన్ సీన్ తో సినిమా తీస్తే కచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతాయని అన్నారు కోనా వెంకట్.

ఐతే ఎలాంటి ఎమోషన్ లేకుండా సినిమాలు ఆడవని.. అలా ఎమోషన్ లేని సినిమాలు హిట్ అవుతాయేమో కానీ బ్లాక్ బస్టర్ అవ్వాలంటే మాత్రం కచ్చితంగా ఒక ఎమోషన్ ఉండాలని అన్నారు. రైటర్ గా నిర్మాతగా కోనా వెంకట్ ప్రేక్షకులకు మంచి సినిమాలు అందిస్తున్నారు. ఈమధ్యనే ఆయన ప్రొడక్షన్ నుంచి గీతాంజలి మళ్లీ వచ్చింది సినిమా వచ్చింది.

సినిమా తలరాత మార్చేది ఒక సీన్ అని.. అది కూడా ఎమోషన్ తో ఆడియన్ హృదయాలను టచ్ చేయాలని అన్నారు కోనా వెంకట్. అలా చేసిన సినిమాలనే ప్రేక్షకులు ఆదరిస్తారని అంటున్నారు. కోనా వెంకట్ చెప్పింది అక్షరాల నిజమని చెప్పొచ్చు. ఎంత పెద్ద కమర్షియల్ సినిమా అయినా ఆడియన్ కు నచ్చాలంటే అందులో కచ్చితంగా ఎమోషనల్ సీన్ ఉండాల్సిందే. ఇదే విషయాన్ని కోనా గారు ఇంకాస్త క్లియర్ గా చెబుతున్నారు.

కోనా వెంకట్ రైటర్ గా ఎన్నో సూపర్ హిట్ సినిమాలు అందించారు. ఆయన కథల్లో ఎక్కువగా ఎంటర్టైన్మెంట్ పాళ్లే ఎక్కువ. ఐతే ఆయన మాత్రం సినిమా సక్సెస్ కు ఎమోషనల్ సీన్సే ఎక్కువ ప్రాధాన్యత వహిస్తాయని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

Tags:    

Similar News