మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. బర్త్ డే గిఫ్ట్ గా తేజు కొత్త సినిమా 'ప్రతిరోజూ పండగే' ఫస్ట్ గ్లింప్స్ ఈరోజు రిలీజ్ అయింది. ఇదిలా ఉంటే హీరోల పుట్టిన రోజుకు అభిమానుల హడావుడి మామూలుగా ఉండదు. సోషల్ మీడియాలో బర్త్ డే విషెస్ చెప్పడం.. హ్యాపీ బర్త్ డే హ్యాష్ టాగ్స్ ట్రెండ్ చేయడం లాంటివి చేస్తుంటారు. ఇక రియల్ లైఫ్ లో రక్తదానం చేయడం లాంటి మంచి పనులతో పాటుగా ఫ్లెక్సీలు కట్టడం.. బ్యానర్లు కట్టడం లాంటివి కూడా చేస్తారు. అయితే తేజు ఇలాంటివాటిపై అభిమానులకు ఒక చిన్న మెసేజ్ ఇచ్చాడు.
తన పుట్టిన రోజు సందర్భంగా చాలామంది మెగా ఫ్యాన్స్ మంచిపనులు చేస్తున్నారని.. వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నానని చెప్పాడు. "ప్రతి ఏడాది మనం ఇలాంటి పనులు చేస్తుంటాం.. ఈ సారి ఒక ప్రాబ్లెంకి శాశ్వత పరిష్కారం చూపిస్తే ఎలా ఉంటుందని ఒక ఆలోచన వచ్చింది. ట్విట్టర్ లో ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ వారు నన్ను టాగ్ చేసి ఆ ఓల్డ్ ఏజ్ హోమ్ నిర్మాణానికి సహాయం కోరారు. ఆ మొత్తం ఖర్చును నేను పెట్టుకునేందుకు సిద్ధం అయ్యాను. నిర్మాణం పూర్తయిన తర్వాత మొదటి ఏడాది ఖర్చు కూడా మేమే చూసుకోవాలని అనుకున్నాం. నేను ఈ సందర్భంగా మెగా ఫ్యాన్స్ ను చేస్తున్న విజ్ఞప్తి ఏంటంటే.. నా బర్త్ డే కోసం ఫ్లెక్సీలు వద్దు. మీరు వాటి కోసం పెట్టే ఖర్చు.. లేక నా బర్త్ డే కోసం పెట్టే ఖర్చు అది ఎంతైనా సరే అది పది రూపాయలైనా.. ఒక రూపాయ అయినా.. నాకు ఇస్తే నేను ఓల్డ్ ఏజ్ వారి కోసం ఖర్చు పెడతాను. దీనికి ఇప్పటికే చాలామంది ఫ్యాన్స్ స్పందించి ఒక లక్షరూపాయలు విరాళం ఇచ్చారు. అందరికీ థ్యాంక్స్" అంటూ తన ఐడియా ను చెప్పాడు.
ఇదేదో తను గొప్ప పని చేస్తున్నానని చెప్పుకోవడం కాదని.. తనను చూసి ఎవరైనా ప్రేరణ పొంది ఒక సమస్యకు కంప్లీట్ సొల్యూషన్ ఇవ్వగలితే చాలా ప్రాబ్లెమ్స్ సాల్వ్ అవుతాయనేది తన నమ్మకం అని చెప్పాడు. తేజు చేపట్టిన ఈ కార్యక్రమానికి నెటిజన్ల నుండి మంచి స్పందన దక్కుతోంది. హీరోలు తమ అభిమానులను ఇలా మంచి పనులు చేసే దిశగా ప్రోత్సహిస్తే సమజానికి కూడా మేలు జరుగుతుందని నెటిజన్లు కూడా మెచ్చుకుంటున్నారు.
Full View