తేజు లుక్కే మారిపోయిందిగా..

Update: 2017-05-03 07:57 GMT
తొలి సినిమా ‘రేయ్’లో ఒకలా కనిపించాడు సాయిధరమ్ తేజ్. ఆ తర్వాత ‘పిల్లా నువ్వు లేని జీవితం’లో మరో కొత్త లుక్ లో దర్శనమిచ్చాడు. ఆపై ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ దగ్గర్నుంచి రెండు మూడు సినిమాల్లో ఒక లుక్ లో కనిపించాడు. ఈ మధ్య ‘విన్నర్’ కోసం కూడా కొంచెం అవతారం మార్చాడు. ఐతే ఇప్పుడు ‘జవాన్’ కోసం పూర్తి డిఫరెంట్ లుక్ లో దర్శనమిస్తున్నాడు.

విన్నర్’ ప్రమోషన్ల తర్వాత తేజు మీడియాలో పెద్దగా కనిపించింది లేదు. సైలెంటుగా బి.వి.ఎస్.రవి దర్శకత్వంలో ‘జవాన్’ మొదలుపెట్టేశాడు. ఈ సినిమా కోసం అతను అవతారం మార్చేశాడు. హేర్ స్టైల్ తో పాటు మొత్తం ఫేస్ కట్టే మారిపోయింది. ఈ కొత్త లుక్ లోనే తాజాగా ఒక ప్రైవేటు కార్యక్రమానికి హాజరయ్యాడు తేజు. శాంసంగ్ గెలాక్సీ-8 ఆవిష్కరణ కార్యక్రమంలో అతను తళుక్కుమన్నాడు. అక్కడ తేజును చూసిన వాళ్లందరూ కొంత ఆశ్చర్యపోయారు. లుక్ కొత్తగా ఉందని అభిప్రాయపడ్డారు.

ఈ లుక్ సంగతలా వదిలేస్తే.. సాయిధరమ్ కెరీర్ కు ‘జవాన్’ చాలా కీలకం. ‘తిక్క’.. ‘విన్నర్’ సినిమాలతో షాకుల మీద షాకులు తిన్నాడు తేజు. ఇంకో ఫ్లాప్ కొడితే బాగా వెనుకబడిపోతాడు. ఈ సినిమా దర్శకుడు బి.వి.ఎస్.రవికి కూడా కీలకమే. తొలి సినిమా ‘వాంటెడ్’ దెబ్బకు మళ్లీ చాలా ఏళ్ల పాటు మెగా ఫోన్ పట్టే అవకావం రాలేదతడికి. ఈసారి తనేంటో రుజువు చేసుకోకుంటే దర్శకుడిగా ఇంకో అవకాశం దక్కడం కష్టమే. మరి ‘జవాన్’ వీళ్లిద్దరికీ ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూద్దాం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News