ఇక అల్లుడి తిక్క

Update: 2015-07-31 05:33 GMT
మెగా హీరోల్లో సాయి ధరమ్ కి వున్న సుడి మరెవ్వరికీ లేదేమో. నిన్న కాక మొన్న వచ్చి ఇప్పుడు మూడు సినిమాలతో బిజీ గా వున్నాడు. రామ్ చరణ్ ఎనిమిదేళ్ళ కెరీర్ లో చేసింది 8 సినిమాలే. సాయి మాత్రం గతేడాది నవంబర్ లో ఒక సినిమా ఆర్నెళ్ళు తిరక్కుండానే మరో సినిమా విడుదల చేశాడు. సుబ్రహ్మణ్యం విడుదల తేదీని ప్రకటించేశాడు. ఈరోజు ఓం దర్శకుడు సునీల్ రెడ్డి దర్శకత్వంలో సినిమాకి కొబ్బరి కాయ కొట్టేశాడు. ఈ సినిమా టైటిల్ కూడా మెగా ఫాన్స్ పిచ్చేక్కిపోయేలా తిక్క అని పెట్టాడు. హ్యాండిల్ విత్ కేర్ అనే కాప్షన్ తగిలించుకుని మరీ వస్తున్నాడీ మెగా మేనల్లుడు.   

ఇన్నాళ్ళు మామ తిక్కని చూసిన మెగా అభిమానులు ఈ సినిమాలో అల్లుడు తిక్కను చూడనున్నారు. చిరు రెండో సినిమా ఫార్ములా కలిసొచ్చినట్టు పవన్ తిక్కలోని అదృష్టం అరువోస్తే ఇక మనోడు స్టార్..  స్టార్.. అంటూ స్టార్ కిరీటం తగిలించుకునే రోజులు వచ్చేసినట్టే. అయితే అంతా దర్శకుడి చేతిలో వుంది. అన్నట్టు మనోడు అయిదుగురు బామలతో ఆడిపాడేది ఈ సినిమాలోనే.              
Tags:    

Similar News