తేజుకి దర్శకుడు ఇస్తున్న ప్రేమ కానుక

Update: 2018-03-26 17:26 GMT
ప్రేమకథా చిత్రాల స్పెషలిస్ట్ సాయిధరం తేజ్.. ఇప్పుడు మెగా హీరోతో మూవీ మొదలు పెట్టేశాడు. పలువురు హీరోలకు చిరకాలం గుర్తుండిపోయే సినిమాలు అందించాడు ఈ దర్శకుడు. ఇప్పుడు సాయిధరం తేజ్ తో మూవీ చేస్తున్న కరుణాకరన్.. అన్ని రకాల ఆడియన్స్ ను అలరించాలని ఫిక్స్ అయిపోయాడు.

సహజంగానే కరుణాకరన్ మూవీస్ చాలా క్లీన్ గా ఉంటాయి. యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా మెప్పించేలా.. సున్నితమైన కామెడీతో నిండిన సినిమాలు తీయడం కరుణాకరన్ ప్రత్యేకత. తేజుతో చేయనున్న మూవీలో కూడా ఇవన్నీ నిండి ఉంటాయని తెలుస్తోంది. అసలు ఈ సినిమాలో చిన్నపాటి సన్నివేశాలు మినహా.. మేజర్ యాక్షన్ సీక్వెన్స్ లు కూడా ఉండబోవట. హీరో-హీరోయిన్.. వీరిద్దరి మధ్య ప్రేమ-సాన్నిహిత్యం ఈ రెండే మెయిన్ థీమ్ గా సినిమా సాగనుందని తెలుస్తోంది. అందుకే అనుపమా పరమేశ్వర్ ను హీరోయిన్ గా తీసుకుంటున్నారని అంటున్నారు.

ఈ మూవీలో సాయిధరం తేజ్ పేరు తేజు కాగా.. అనుపమ పాత్ర పేరు నందిని. డిగ్రీ పూర్తయిన తర్వాత ప్రేమలో పడ్డ జంటగా కనిపించనున్నారు. అటు అర్బన్ ఎపిసోడ్స్.. ఇటు రూరల్ బ్యాక్ గ్రౌండ్ ను సమపాళ్లలో మిక్స్ చేసిన ఈ చిత్రంలో.. హీరో హీరోయిన్లకు సమానమైన ప్రాధాన్యత ఉన్న పాత్రలు ఉంటాయని తెలుస్తోంది. క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై కేఎస్ రామారావు నిర్మిస్తున్న ఈ చిత్రానికి గోపీ సుందర్ దర్శకుడు. ఏప్రిల్ నెలాఖరుకు షూటింగ్ పూర్తి చేసి జూన్ మొదటివారంలోగా విడుదల చేసేలా ప్లాన్ చేసుకున్నారట.

Tags:    

Similar News