తేజు రిస్క్ అవసరమా?

Update: 2018-05-25 17:30 GMT
వరుసగా హిట్స్ అందుకోవడం అంటే ఈ రోజుల్లో కష్టమే అని చెప్పాలి. అందుకే స్టార్ హీరోలు ఎక్కువ శాతం ఏడాదికి ఒక సినిమా చేస్తూ ఆడియెన్స్ కి బోర్ కొట్టకుండా అలరిస్తారు. కానీ కొంత మంది యువ హీరోలు మాత్రం ఒక సినిమా అలా సెట్స్ పైకి వెళ్లిందో లేదో మరో సినిమా మొదలు పెట్టేస్తున్నారు. సినిమా మొదలైతే ఏ సమయానికి పూర్తి చెయ్యాలి. ఎలాంటి టైమ్ లో రిలీజ్ చెయ్యాలి అనే విషయాలను కూడా పట్టించుకోవడం లేదు.

గత కొంత కాలంగా మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ పరిస్థితి కూడా అలానే ఉంది. ఒక్క హిట్టు కొట్టాలని ఎంతగా ప్రయత్నిస్తున్నాడో సినిమాలు రిలీజ్ అవుతున్న దాన్నిబట్టి తెలుసుకోవచ్చు. మినిమమ్ రెమ్యునరేషన్ అయితే బాగానే దక్కుతోంది గాని మెగా ఇమేజ్ స్థాయిలో బాక్స్ ఆఫీస్ హిట్ అందుకోవట్లే. ఈ హీరో కెరీర్ లో వరుసగా ఫెయిల్యూర్స్ రావడానికి ఓ విధంగా సినిమాల విడుదల సమయమని కూడా చెప్పాలి.

గతంలో ఇతర సినిమాలతో పోటీకి దిగి చేతులు కాల్చుకున్నాడు. ఇక ప్రస్తుతం చేస్తోన్న తేజ్ ఐ లవ్ యూ సినిమాను జూన్ 26కు ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే. కరుణాకరన్ దర్శకత్వంలో వస్తుండడంతో ఎంతవరకు విజయం అందుకుంటుంది అనేది ఒక డౌట్ అయితే ఆ సమయంలో మరి కొన్ని పెద్ద సినిమాలు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అసలే కరుణాకరన్ వరుస ఫెయిల్యూర్స్ కి మార్కెట్ లేదు. ఎలాగోలా రిలీజ్ అవుతుంది కానీ అలాంటి సమయంలో రిస్క్ చేయడం అవసరమా? అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.      


Tags:    

Similar News