70% తిక్కకు ఓ లెక్క వచ్చిందట

Update: 2016-04-09 04:21 GMT
సాయి ధరం తేజ్ హీరోగా ఒకేసారి రెండు సినిమాలు రూపొందుతున్నాయి. ఒకటి దిల్ రాజు బ్యానర్ లో అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న సుప్రీం కాగా.. రెండో మూవీ తిక్క. శ్రీ వెంకటేశ్వర మూవీ మేకర్స్ పతాకంపై తొలిసారిగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సునీల్ రెడ్డి దర్శకుడు.

ప్రస్తుతం టాకీ పార్ట్ పూర్తి చేసుకున్న తిక్కను.. జూలైలో విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నామని యూనిట్ చెబుతోంది. సినిమా చాలా బాగా వచ్చిందని.. త్వరలో పాటలను పూర్తి చేయబోతున్నాం అంటున్నాడు దర్శకుడు సునీల్ రెడ్డి. ప్రస్తుతం 70 శాతం షూటింగ్ పూర్తి చేసుకోగా.. ఈ మూవీలో ఎంటర్టెయిన్మెంట్ అందరూ ఎంజాయ్ చేస్తారని తేజు చెబుతున్నాడు. అదీ లెక్క. ఇప్పుడు తిక్క చిత్రాన్ని తెరకెక్కిస్తున్న నిర్మాణ సంస్థ.. తమ రెండో సినిమాని సీనియర్ హీరో నరేష్ కుమారుడు నవీన్ విజయ్ కృష్ణ హీరోగా ప్రారంభించింది.

ఓ ప్రెస్ మీట్ తేజుతో పాటు నవీన్ కృష్ణ కూడా పాల్గొన్నాడు. తిక్క సినిమా టీజర్ ను తాను చూశానని.. బాగా ఎంజాయ్ చేశానంటున్నాడు నవీన్ విజయ్ కృష్ణ. తనతో సినిమాని తీసిన నిర్మా రోహిణ్ కుమార్ రెడ్డి.. మరుసటి చిత్రాన్ని తన బెస్ట్ ఫ్రెండ్ తో తీయడం హ్యాపీగా ఉందన్నాడు సాయిధరం తేజ్.
Tags:    

Similar News