తన ''తిక్క'' చూపించడానికి రెడీ అవుతున్నాడు సాయిధరమ్ తేజ్. ఆగస్టు 13న వచ్చేస్తున్నా అంటూ ఆల్రెడీ డేట్ ఇచ్చేశాడు. అయితే ఇంతకీ షూటింగ్ ఎంతవరకు వచ్చింది మరి? అసలు షూటింగ్ అయిపోయిందా? అవలేదా? పదండి చూద్దాం.
నిజానికి గత వారం నుండి లడఖ్ లోయలోని వివిధ ప్రాంతాల్లో ''తిక్క'' షూటింగ్ జరుగుతూ ఉంది. అక్కడే హీరో సాయిధరమ్ మరియు హీరోయిన్ లారిస్సా బొనేసి మీద పాటలను తీస్తున్నాడు దర్శకుడు సునీల్ రెడ్డి. హిమాలయన్ అందాల నడుమ ఈ బ్రెజిల్ భామ అందాలను కెమెరాలో బంధిస్తూ.. సాయిధరమ్ చేత మాంచి డ్యాన్సులు వేయిస్తున్నారట. అయితే ఈ తతంగం అంతా ఈరోజుతో ముగిసిపోయింది. ఇకపోతే షూటింగ్ పూర్తవ్వగానే 'ఎప్పుడూ నీతోనే' అంటూ సాయిధరమ్ పై కామెడీ చేసింది ఈ హీరోయిన్. మరి పాట లిరిక్ ను చెప్పిందో లేకపోతే నిజంగానే ఎప్పుడూ నీతోనే అంటోంది తెలియదు.
సినిమా విషయానికొస్తే.. అవుటు పుట్ చాలా బాగావచ్చిందనే టాక్ వినిపిస్తోంది. సాయిధరమ్ తన సక్సెస్ స్ర్టీక్ ను కంటిన్యూ చేస్తాడేమో చూడాలి.