టెక్నికల్ గా చెప్పాలంటే ఆ హీరో తొలి సినిమా డిజాస్టర్. పెట్టుబడిలో నాలుగో వంతు కూడా వసూలు చేయలేదు. షూటింగ్ మొదలైన నాలుగేళ్లకు కానీ సినిమా విడుదల కాలేదు. ఇలాంటి ట్రాక్ రికార్డున్న హీరో ఇప్పుడు మూణ్నాలుగు సినిమాలతో రెండేళ్ల పాటు ఖాళీ లేని స్థితిలో ఉంటాడని ఊహించగలమా? మెగా హీరో సాయిధరమ్ తేజ్ కు పట్టిన అదృష్టమిది. అతడి తొలి సినిమా ‘రేయ్’ తొలి సినిమాగా విడుదలై ఉంటే పరిస్థితి ఎలా ఉండోదో కానీ.. దాని బదులు ‘పిల్లా నువ్వు లేని జీవితం’ ముందు విడుదలవడంతో కుర్రాడి జాతకం మారిపోయింది. ఆ సినిమా సాయిధరమ్ ను టాలీవుడ్లో సక్సెస్ ఫుల్ హీరోగా నిలబెట్టేసింది.
పరిశ్రమలో సక్సెస్ కు ఉండే విలువేంటో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ‘రేయ్’ రెండో సినిమాగా విడుదలై అట్టర్ ఫ్లాప్ అయినా.. ఆ ప్రభావం మెగా కుర్రాడిపై పడలేదు. ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ సినిమా చేస్తున్న సాయి.. దీని తర్వాత ‘పటాస్’ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు బేనర్లోనే ఇంకో సినిమాకు కమిటయ్యాడు. ఇవి కాకుండా తాజాగా ఇంకో సినిమాకు కూడా కమిట్మెంట్ ఇచ్చాడు సాయిధరమ్. కళ్యాణ్ రాంతో ‘ఓం’ అనే ఫ్లాప్ సినిమా తీసిన సినిమాటోగ్రాఫర్ టర్న్డ్ డైరెక్టర్ సునీల్ రెడ్డితో అతను ఓ సినిమా చేయబోతున్నాడు. తొలి సినిమా ఫ్లాపయినా ఈసారి కచ్చితంగా హిట్టు కొట్టాలన్న కసితో మంచి కథ పట్టుకెళ్లి మెగా ఫ్యామిలీకి చెప్పి ఓకే చేయించుకున్నాడట సునీల్ రెడ్డి. ఈ ఏడాది చివర్లో ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్తుంది.