మెగా హీరోల బాడీ లాంగ్వేజ్ ఆల్ మోస్ట్ యాక్షన్ మోడ్ లో ఉంటుంది. అందుకే వీళ్లు సెలెక్ట్ చేసుకునే స్క్రిప్టుల్లో డిష్యుం డిష్యుం ఇన్ బిల్ట్ అయ్యి ఉంటుంది. యాక్షన్ ఇమేజ్ తో మాస్ లో దూసుకుపోవడమే అండర్ కరెంట్ ఫార్ములా. ఇప్పటికిప్పుడు మెగా హీరోలు ముగ్గురూ అవే తరహా కథాంశాల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్, బన్ని, సాయిధరమ్ ముగ్గురూ రామోజీ ఫిలింసిటీలో యాక్షన్ మోడ్ లో ఉన్నారు. ఇంకాస్త డీటెయిల్స్ లోకి వెళితే...
రామ్ చరణ్ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలోని బ్రూస్ లీ రామోజీ ఫిలింసిటీలో తెరకెక్కుతోంది. అక్కడ హెలీప్యాడ్ జంక్షన్ లో వెంకట్ మాష్టర్ సారథ్యంలో ఫైట్ ని చిత్రీకరిస్తున్నారు. అలాగే బన్ని హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న (సరైనోడు వర్కింగ్ టైటిల్) సినిమా పోరాట సన్నివేశాల్ని ఆర్ ఎప్ సీలో తీస్తున్నారు. మాటు వేసి దెబ్బ తీయాలనుకుంటే తెలివైన దెబ్బ వేశాడు హీరో. ఈ పోరాటం సినిమాకే హైలైట్ గా ఉంటుందని సమాచారం. రామ్ లక్ష్మణ్ మాష్టర్ లు పోరాటాల్ని తెరకెక్కిస్తున్నారు.
మరో హీరో సాయిధరమ్ సునీల్ రెడ్డి దర్శకత్వంలోని తిక్కలో నటిస్తున్నాడు. రామోజీ పిలింసిటీలో హైవే రోడ్డు పరిసరాల్లో పోరాట సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. సాయిధరమ్ విలన్ లను పరిగెత్తించి వెంటతరిమి మరీ చితక్కొడుతున్నాడు. తనని రెచ్చగొడితే తిక్క ఎలా ఉంటుందో చూపిస్తున్నాడు.