మెగా హీరోలు చాలామందే ఉన్నారు కానీ సాయి ధరమ్ తేజ్ పైన వచ్చినన్ని లవ్.. ఎఫైర్ వార్తలు వేరే ఏ మెగా హీరోపైన రావు. అయితే తేజు మాత్రం అవన్నీ రూమర్లని..గాసిప్స్ అని తోసిపుచ్చుతూ ఉంటాడు. చిత్రమైన విషయం ఏంటంటే తేజు ఎంతగా వాటిని గాసిప్పులుగా తీసిపారేసినా అవి మాత్రం ఆగవు. రీసెంట్ గా తేజు తన రియల్ లవ్ గురించి మాట్లాడాడు.
తేజు జీవితంలో ఒక లవ్ స్టొరీ ఉందట. సినిమా హీరో కాకమునుపు తేజు తన కాలేజ్ ఫ్రెండ్ ను ప్రేమించాడట. అయితే కాలేజీ చదువు ముగిసిన తర్వాత హీరో కావడానికి ఐదేళ్ళు పట్టిందని ఆ సమయంలోనే తమ బ్రేకప్ జరిగిందని ఓపెన్ గా చెప్పాడు. తన కెరీర్ లో అప్పటికి సెటిల్ కాలేదని.. ఆ సమయంలోనే ఆ అమ్మాయికి వేరే వ్యక్తితో పెళ్ళి అయిపోయిందని వెల్లడించాడు. ఇక తనపై వచ్చే లవ్ గాసిప్స్ గురించి మాట్లాడుతూ తను ప్రస్తుతం సింగిల్ అనే విషయం పై క్లారిటీ ఇచ్చాడు. హీరోయిన్లతో క్లోజ్ గా.. ఫ్రెండ్లీగా ఉండడం తన స్వభావమని.. రాశి.. రాకుల్.. రెజీనా అందరం క్లోజ్ గా ఉంటామని తెలిపాడు. అయితే తాము అలా క్లోజ్ గా ఉండడం చూసిన వాళ్ళు ఏదో ఊహించుకుంటారని చెప్పాడు. ఒకవేళ హీరోయిన్ తో రెండు మూడు సినిమాలు చేస్తే ఆ రూమర్లు మరింతగా పెద్దవి అవుతాయని అన్నాడు. "జనాలు నన్ను సింగిల్ గా ఉండనివ్వడం లేదు" అంటూ మీడియాకు కూడా చిన్న పంచ్ ఇచ్చాడు మెగా హీరో. పెళ్ళి విషయం మాట్లాడుతూ.. కెరీర్ లో ఇంకా సెటిల్ అయ్యానని అనుకోవడం లేదని.. సెటిల్ కాగానే పెళ్లి చేసుకుంటానని తెలిపాడు.
ఇక తేజు ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే కామెడీ ఎంటర్టైనర్లకు కేరాఫ్ అడ్రెస్ అయిన మారుతి దర్శకత్వంలో 'ప్రతి రోజూ పండగే' అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారట.