సాయిధరమ్ తేజ్.. మళ్లీ ఖండించాడు

Update: 2018-04-05 04:02 GMT
మీడియాలో ఒక సినిమా గురించి ఒక వార్త రావడం.. దాన్ని చిత్ర బృందం ఖండించడం మామూలైపోయింది. కొత్త సినిమాలకు సంబంధించి ఇలాంటి రూమర్లు సోషల్ మీడియాలో చాలా వేగంగా స్ప్రెడ్ అయిపోతుంటాయి. సాయిధరమ్ తేజ్ నటిస్తున్న కొత్త సినిమా గురించి కూడా ఎప్పటికప్పుడు ఇలాంటి ప్రచారాలే జరుగుతున్నాయి. ఇంతకుముందు ఈ చిత్రానికి ‘దేవుడు వరమందిస్తే’ అనే టైటిల్ పెట్టినట్లు ప్రచారం జరిగింది. దాని సాయిధరమ్ తేజ్ స్వయంగా ఖండించాడు. ఇప్పుడు ‘అందమైన చందమామ’ అంటూ మరో టైటిల్ తెరమీదికి వచ్చింది. దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో విస్తృతమవుతుండటంతో తేజు అలెర్టయ్యాడు.

‘అందమైన చందమామ’లో అనే టైటిల్ తమ సినిమాకు ఖరారు చేసినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని.. ఇంకా ఏ పేరూ ఖరారు కాలేదని అతను క్లారిటీ ఇచ్చాడు. ఇప్పటిదాకా చాలా వరకు మాస్ మసాలా సినిమాల్లోనే నటించిన తేజు.. తొలిసారి పూర్తి స్థాయి ప్రేమకథలో నటిస్తున్నాడు. ‘తొలి ప్రేమ’ ఫేమ్ కరుణాకరన్ ఈ చిత్రానికి దర్శకుడు. అనుపమ పరమేశ్వరన్ ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తోంది. సీనియర్ నిర్మాత కె.ఎస్.రామారావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఐదు వరుస డిజాస్టర్ల తర్వాత తేజు నటిస్తున్న సినిమా ఇది. ఈ చిత్రం విజయవంతం కావడం అతడి కెరీర్‌ కు చాలా చాలా అవసరం. ‘తొలి ప్రేమ’ తర్వాత ఆ స్థాయి సినిమాను అందించని కరుణాకరన్ గత కొన్నేళ్లలో బాగా వెనుకబడిపోయాడు. అతడికి కూడా ఈ చిత్రం కీలకమే.
Tags:    

Similar News