హీరోలు అన్నాక అంతో ఇంతో భేషజం ఉంటుంది. ఓ స్థాయి వచ్చిన తర్వాత తప్పనిసరిగా మెయింటెయిన్ చేయాల్సిన అవసరం కూడా వస్తుంది. లేకపోతే తాటాకులు కట్టేసే లోకం కదా ఇది. అందులోనూ మెగా హీరోలు అన్నాక ఈ విషయంలో మరింత అలర్ట్ గానే ఉంటారు. కానీ సాయి ధరం తేజ్ మాత్రం తాను ప్రత్యేకం అనిపించుకుంటున్నాడు.
సహజంగానే ఇతడి ప్రవర్తన చాలా సహజంగా ఉంటుంది. ఎలాంటి బింకాలు బీరాలు లేకుండా సామాన్యంగా ప్రవర్తిస్తాడని.. మంచి ఫ్రెండ్లీ నేచర్ అనే పేరుంది. రీసెంట్ గా వైజాగ్ లో జరిగిన తేజ్ ఐ లవ్యూ ఆడియో సక్సెస్ మీట్ కు ఇతడు అటెండ్ అయిన తీరు మరీ ఆశ్చర్యపరిచేసింది. తను ఉంటున్న హోటల్ నుంచి ఎంచక్కా బైక్ పై రైడింగ్ చేసుకుంటూ వెన్యూకు వచ్చేశాడు సాయి ధరం తేజ్. ఓ మెగా ఫ్యామిలీ హీరో.. అందులోనూ కంటెంట్ బాగుంటే పాతిక కోట్ల వసూళ్లను రాబట్టే సత్తా ఉన్న సుప్రీం హీరో ఇంత సింపుల్ గా బిహేవ్ చేయడం అందరినీ ఆకట్టుకుంటుంది.
కరుణాకరన్ దర్శకత్వంలో అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించిన తేజ్ ఐ లవ్యూ చిత్రానికి పాజిటివ్ బజ్ నెలకొంది. ఈ ఈవెంట్ లో కూడా ఎక్కడా ఎలాంటి బడాయి ప్రదర్శించలేదు సాయి ధరం తేజ్. ఎంత సింపుల్ డ్రెసింగ్ తో వచ్చాడో.. అంతే చక్కగా మాట్లాడడం అందరినీ మెప్పించింది.