చేసిన పాపం ఊరికే పోనట్లు.. చేసిన పుణ్యం కూడా వెంట వస్తుందని చెబుతారు. మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ఉదంతంలో ఇది మాత్రం నూటికి నూరుపాళ్లు కరెక్టు. గతంలో పలుమార్లు అతను మంచి మనసుతో చేసిన సాయాలు అతనికి తాజాగా రక్షగా నిలిచాయని చెప్పాలి. రోడ్డు మీద ఉన్న ఇసుక మేట కారణంగా బైక్ స్కిడ్ కావటం.. రోడ్డు ప్రమాదానికి గురి కావటం తెలిసిందే. ఈ సందర్భంగా గాయాలపాలైన తేజ్ ను.. దారిన వెళ్లే వారు ఆగి మరీ సాయం చేసి అతన్ని సరైన సమయంలో ఆసుపత్రికి చేరుకునేలా చేశారు.
ఈ ఉదంతం గురించి తెలిసిన వారు పాత విషయాల్ని గుర్తు చేసుకుంటున్నారు. గతంలో తేజ్ చేసిన సాయమే ఈరోజు అతన్ని సేవ్ చేసిందన్న మాట వినిపిస్తోంది. ఏడాది క్రితం జూబ్లీహిల్స్ నుంచి తన కారులో వెళుతున్న వేళలో.. రోడ్డు మీద ఒక టూవీలర్ మీద ప్రయాణించే వ్యక్తి ప్రమాదానికి గురయ్యాడు. ఆ ఉదంతంలో గాయపడిన అతన్ని.. అక్కడే ఉన్న ట్రాఫిక్ పోలీసు సాయంతో తన కారులోనే ఆసుపత్రికి తరలించాడు సాయి ధరమ్ తేజ్.
అంతేకాదు.. రెండేళ్ల క్రితం ఫిలింనగర్ రోడ్డు మీద ఒక భిక్షగాడు.. స్ప్రహతప్పి పడిపోతే.. అటుగా తన కుటుంబంతో పాటు వెళుతున్న తేజ్.. కారు నుంచి దిగి యాచకుడి మీద నీళ్లు జల్లి.. ఆసుపత్రికి తరలించాడు. ఇలా గతంలో అతడు చేసినసాయాలు.. అతను కష్టంలో ఉన్నప్పుడు.. ప్రమాదానికి గురైనప్పుడు అతన్ని సరైన సమయంలో ఆసుపత్రికి చేరేలా చేసి.. సకాలంలో సాయం అందేలా చేశాయని చెప్పక తప్పదు. చేసిన దానికి తగిన ఫలితం పొందటం అంటే ఇదేనేమో?