​తెర పైన పాడు పనులు చేయను

Update: 2017-08-05 06:21 GMT
ఇప్పుడు సినిమాలో హీరో పాత్రలు చూపించే విదానం మారింది.  ఆ పాత్ర మిగతా పాత్రలుతో డీల్ చేసే పద్దతి కూడా మారింది. హీరో తుంటరిగా పోకిరిగానే కాకుండా భాద్యత తెలిసిన మనిషిగా నడుచుకుంటున్నాడు. అమ్మాయిలును ఏడిపించకూడదు సిగరెట్ తాగకూడదు మందు కొట్టకూడదు అని మనకు అందరూ నీతులు చెబుతూ ఉంటారు కదా.  మరి మనం సినిమాలుకు వెళ్ళి చూసినప్పుడు మన హీరో ఏమి చేస్తాడు? ప్రేక్షకులు అభిమాన తారలు అలా చేస్తే ఇంకా ఆ స్టార్ అభిమానులు కూడా అలానే నడుచుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది కదా. అందుకని ఒక మెగా హీరో ఇక పై అటువంటి పనులు తెర పై చేయను అని ఒట్టుపెట్టుకున్నాడట.

మెగా స్టార్ మేనల్లుడు సాయిధరమ్ తేజ్ తన తదుపరి సినిమాలులో  అలా కనిపించబోనని చెబుతున్నాడు. సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ “ నేను ఇక పై సిగరెట్ తాగబోనని మాట ఇస్తున్నాను. నా సినిమాలో పాత్ర ఎంత డిమాండ్ చేసిన దాని జోలికి వెళ్ళను. మందు కొంచెం  ఓకే కానీ నో స్మోకింగ్ ప్లీజ్ అంటున్నాడు. ఇదే కాకుండా రోడ్ పక్కన ఉండే రోమియొ లాగా ఇక పై కనిపించను. అలా హీరోయిన్ని విసిగించే మాటలు, పాటలు పాడబోను. నేను ఈ నిర్ణయం 'విన్నర్'  సినిమా నుండి తీసుకున్నాను'' అని తెలిపాడు.

మనం ఒక అమ్మాయిని ఇష్టపడితే ఆమెను గౌరవించాలి కానీ అలా అల్లరి చేయకూడదు అని కూడా చెప్పాడు సాయిధరమ్. తను నటించిన నక్షత్రం సినిమాలో కూడా ఒక పాటలో కృష్ణ వంశీ గారు బీర్ బాటిల్ పట్టుకోమని చెబితే అతనికి తన నిర్ణయాన్ని తెలియజేసి ఒప్పించాడట. మంచిది బాబు నీలాగే మిగతా హీరోలు కూడా ఇలాంటి నిర్ణయం తీసుకుంటే తెలుగు సినిమా గౌరవం పెరిగేటట్లుగానే కనిపిస్తుంది.​
Tags:    

Similar News