శతమానం మిస్సయినా కళ్యాణానికి రెడీ

Update: 2017-04-14 04:30 GMT
మెగాభిమానులతో సుప్రీమ్ హీరో అని ముద్దుగా పిలిపించుకుంటున్న సాయిధరం తేజ్.. ఇప్పుడు ఓ కొత్త సినిమాకు ఓకే చెప్పాడట. శర్వానంద్ హీరోగా శతమానం భవతి అంటూ సంక్రాంతి బ్లాక్ బస్టర్ ను అందించిన సతీష్ వేగేశ్న దర్శకత్వంలో.. తేజు కొత్త సినిమాకు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.

నిజానికి శతమానం భవతి మూవీకి ఫస్ట్ ఆప్షన్ తేజునే. ఎందుకో తెలీదు కానీ.. ముందు ఓకే చెప్పినా.. ఆ తర్వాత ఈ ప్రాజెక్టు నుంచి మెగా హీరో తప్పుకున్నాడు. తిక్క.. విన్నర్ లు చేసుకున్నాడు. ఈ రెండు మూవీస్ ఫెయిల్ అయితే.. శతమానం భవతి కమర్షియల్ బ్లాక్ బస్టర్ గా నిలవడమే కాకుండా.. నేషనల్ అవార్డ్ కూడా పట్టేసింది. ఇప్పుడీ చిత్ర దర్శకుడు సతీష్ వేగేశ్న.. మరో ఫ్యామిలీ స్టోరీతో సాయిధరం తేజ్ ను కలిశాడట. ఇప్పటికే ఈ స్టోరీకి 'శ్రీనివాస కళ్యాణం' అనే టైటిల్ ని దిల్ రాజు బ్యానర్ కింద రిజిస్ట్రేషన్ చేయించేసిన సతీష్.. తేజుకు స్టోరీ నెరేషన్ వినిపించాడట.

శతమానం భవతి ఎఫెక్ట్ అనాలో.. సతీష్ వేగేశ్న చెప్పిన తీరు అనాలో కానీ.. మొత్తానికి ఫస్ట్ ఎటెంప్ట్ లోనే ఈ మూవీ చేసేందుకు తేజు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని అంటున్నారు. త్వరలోనే దిల్ రాజు నుంచి అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా రానుందట. ఒకవైపు బీవీఎస్ రవి దర్శకత్వంలో జవాన్ షూటింగ్ చేస్తూనే.. ఈ శ్రీనివాస కళ్యాణంలో కూడా తేజు నటించే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News