టాలీవుడ్ లో గత కొంత కాలంగా హిట్టు కోసం వెయిట్ చేస్తున్న మెగా హీరో సాయి ధరమ్ తేజ్. వరుసగా అయిదు పరాజయాల ఊబిలో ఉన్న ఈ హీరోను మెగాస్టార్ పైకి లాగందుకు ప్రయత్నాలు స్టార్ట్ చేశారు. మరోవైపు పవన్ కళ్యాణ్ కూడా తన వైపు నుంచి మేనెల్లుడికి మద్దతు ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు. ఇకపోతే తేజ్ నెక్స్ట్ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని అనుకుంటున్నాడు.
ప్రేమ కథల దర్శకుడు కరుణాకరణ్ తో చేసిన తేజ్ ఐ లవ్ యూ సినిమాపైనే మెగా అల్లుడు ఆశలు పెట్టుకున్నాడు. ఆ సినిమాపై ప్రస్తుతం అంచనాలు బాగానే ఉన్నాయి. అయితే సడన్ గా కొన్ని అనుకోని కారణాల వల్ల సినిమాను వాయిదా వేయాల్సి వచ్చింది. అసలైతే సినిమా జూన్ 29న రానుందని సినిమా మొదలుపెట్టినప్పుడే చిత్ర యూనిట్ తెలిపింది.
ఇక ఇప్పుడు మరో వారం సమయం తీసుకొని జులై 6న గ్రాండ్ గా సినిమాను విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఇక సాయి ధరమ్ తేజ్ సరసన ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. థమన్ సంగీతం అందించిన ఈ సినిమాను సీనియర్ ప్రొడ్యూసర్ కేఏస్.రామారావు నిర్మించారు.