వైవీఎస్ కు ఎప్పటికీ రుణపడి ఉంటా-తేజ్

Update: 2015-09-17 06:16 GMT
టాలీవుడ్ లో పెద్ద ఫ్యామిలీల నుంచి వచ్చిన ఏ హీరోకూ అరంగేట్రంలో ఎదురవని చేదు అనుభవం ఎదురైంది సాయిధరమ్ తేజ్ కి. తొలి సినిమా విడుదల కోసం అతను మూడేళ్ల పాటు ఎదురు చూశాడు. అంత వెయిట్ చేశాక ఆ సినిమా దారుణమైన ఫలితం చవిచూసింది. ఇలాంటి సందర్భంలో ఆ సినిమా ఎందుకు చేశానా అని ఫీలవడం సహజం. కానీ తనకలాంటి ఫీలింగేమీ లేదంటున్నాడు సాయిధరమ్.

తనను హీరోగా పరిచయం చేసిన వైవీఎస్ చైదరికి తానెప్పుడూ రుణపడి ఉంటానంటున్నాడు సాయిధరమ్. వైవీఎస్ వల్ల చాలా నేర్చుకున్నానని.. ‘రేయ్’ సినిమాతో అరంగేట్రం చేసినందుకు తనకేమీ బాధలేదని.. సినిమాకు అలాంటి ఫలితం వచ్చినందుకు మొదట బాధపడ్డా.. తర్వాత పెద్దగా ఆలోచించలేదని సాయిధరమ్ చెప్పాడు. తొలి అవకాశం ఇచ్చిన వైవీఎస్ కు రుణపడి ఉంటానని చెప్పి తన వినమ్రతను చాటుకున్నాడు సాయి.

తన కొత్త సినిమా ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ గురించి మాట్లాడుతూ.. నటుడిగా తనకీ సినిమా ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెస్తుందని.. తనను మరో స్థాయికి తీసుకెళ్తుందని నమ్ముతున్నానని సాయి చెప్పాడు. కెరీర్ ఆరంభంలోనే హరీష్ లాంటి స్టార్ డైరెక్టరుతో తన అదృష్టమన్న సాయిధరమ్..  సినిమా తీయడంలో అతను చూపించిన వేగం తనను ఆశ్చర్యపరిచిందన్నాడు. రెజీనాతో వరుసగా రెండో సినిమా చేయడం వల్ల తనతో చక్కటి కెమిస్ట్రీ కుదిరిందని.. రొమాంటిక్ సీన్స్ లో చాలా కంఫర్టుబుల్ గా నటించామని.. తమ జోడీ ఈ సినిమాతో మరోసారి ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందని తేజ్ విశ్వాసం వ్యక్తం చేశాడు.
Tags:    

Similar News