‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ సినిమాతో మాంచి క్రేజ్ తెచ్చుకున్నాడు మెగా హీరో సాయిధరమ్ తేజ్. ఆ ఊపులో ఒకేసారి రెండు సినిమాల్ని లైన్లో పెట్టాడు. దిల్ రాజు బేనర్ లో అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ‘సుప్రీమ్’లో నటిస్తూనే.. ‘ఓం’ ఫేమ్ సునీల్ రెడ్డి దర్శకత్వంలో ‘తిక్క’ చేస్తున్నాడు. గత నెల వరకు ‘సుప్రీమ్’ కోసం పని చేసిన సాయిధరమ్.. ప్రస్తుతం మళ్లీ ‘తిక్క’ షూటింగులో పాల్గొంటున్నాడు. హైదరాబాద్ లోని గండిపేటలో ‘తిక్క’ షూటింగ్ జరుగుతోంది. ప్రస్తుతం అక్కడ ఛేజ్ సీన్స్, పెళ్లికి సంబంధించిన సన్నివేశాలు తీస్తున్నారు. ఈ షెడ్యూల్ తో సగం షూటింగ్ అయిపోతుందని సమాచారం.
కాగా ‘తిక్క’ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ బయటికి వచ్చింది. ఈ సినిమా కేవలం రెండు రోజుల్లో ముగిసిపోయే కథతో తెరకెక్కుతోందట. ఓ ప్రయోగాత్మక కథతో యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడట సునీల్ రెడ్డి. స్క్రీన్ ప్లే ప్రధానంగా ఈ చిత్రం తెరకెక్కుతోందని.. సాయిధరమ్ కెరీర్ లో ఇది డిఫరెంట్ మూవీ అవుతుందని అంటున్నారు. సునీల్ రెడ్డి తొలి సినిమా ‘ఓం’ కూడా ఓ డిఫరెంట్ మూవీనే. అందులో యాక్షన్ పాళ్లు ఎక్కువైపోవడంతో జనాలకు నచ్చలేదు. ఐతే ఈసారి ఎంటర్ టైన్ మెంట్ డోస్ పెంచి తన రెండో సినిమా తీస్తున్నాడట సునీల్ రెడ్డి. రోహిన్ రెడ్డి అనే కొత్త నిర్మాత తీస్తున్న ఈ సినిమా వేసవిలో ప్రేక్షకుల ముందుకొస్తుంది. సాయిధరమ్ సరసన లారిస్సా అనే కొత్తమ్మాయి హీరోయిన్ గా నటిస్తోంది.