అనుకోకుండా డిస్ట్రిబ్యూషన్ లోంచి నిర్మాణంలోకి వచ్చి పెద్ద ప్రొడ్యూసర్ గా ఎదిగాడు సాయి కొర్రపాటి. కొత్త వాళ్లెవ్వరినీ తన కాంపౌండ్ లోకి రానివ్వని బాలయ్యకు ఎందుకో సాయితో మంచి స్నేహం కుదిరింది. ఆ బేనర్ లో ‘లెజెండ్’ సినిమా కూడా చేశాడు. తన వందో సినిమా కోసం ఎంతోమంది నిర్మాతలు లైన్ లో ఉన్నప్పటికీ సాయి బేనర్లోనే ఆ సినిమా చేయాలని ఫిక్సయినట్లు వార్తలొచ్చాయి. మరోవైపు బాలయ్య కొడుకు నందమూరి మోక్షజ్న అరంగేట్రం కూడా ‘వారాహి చలనచిత్రం’ బేనర్ లోనే ఉండొచ్చని ప్రచారం కూడా జరిగింది. ఈ వార్తలపై స్వయంగా సాయి కొర్రపాటే క్లారిటీ ఇచ్చాడు.
ఇటీవలే ఓ కార్యక్రమంలో సాయి కొర్రపాటి మాట్లాడుతూ.. బాలయ్య వందో సినిమాను ‘లెజెండ్’ సినిమా తీసిన 14 రీల్స్ - వారాహి చలనచిత్రం బేనర్లు సంయుక్తంగా నిర్మిస్తాయని వెల్లడించారు. ఈ సినిమా గురించి ఇంతకుమించి ఏమీ మాట్లాడలేనని చెప్పిన సాయి.. మోక్షజ్న అరంగేట్రం గురించి కూడా ప్రస్తావించాడు. బాలయ్య కొడుకును తమ సంస్థ ద్వారానే హీరోగా పరిచయం చేయడానికి అంగీకారం కుదరిందన్నాడు. ఐతే మోక్షజ్న అరంగేట్రం ఎప్పుడన్నది కరెక్టుగా చెప్పలేనని అన్నాడు. దీన్ని బట్టి బాలయ్య సాయి కొర్రపాటికి ఎంత ప్రయారిటీ ఇస్తున్నాడో అర్థం చేసుకోవచ్చు. బాలయ్యకు ఒక్కసారి ఓ వ్యక్తి నచ్చాడంటే వదలరని అంటారు. సాయి కొర్రపాటి అలాగే బాలయ్యకు బాగా క్లోజ్ అయిపోయినట్లున్నాడు.