తన ప్రతీ సినిమాలోనూ ఏదో ఒక ఎలిమెంట్ ఇంప్రెసివ్ గా ఉండేలా చూసుకుంటారు నిర్మాత సాయి కొర్రపాటి. తీసిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్లు కాకపోయినా కూడా.. వాటిలో ఉన్న మ్యాటర్ చూసి క్రిటిక్స్ కూడా ఈ నిర్మాతను పొగుడుతుంటారు.
అయితే ఇప్పుడు ''తుంటరి'' సినిమాను చాలా ఏరియాల్లో డిస్ర్టిబ్యూట్ చేస్తున్న సాయి కొర్రపాటి.. ఒక ప్రెస్ నోట్ లో తన సినిమాల ప్రస్థానంలో ఎక్కడా కూడా ''గుంటూర్ టాకీస్'' గురించి ప్రస్తావించలేదు. ముందుగా సినిమాను చూసి కొనేసుకొని పంపిణీ చేసిన ఆయన.. ఎందుకో రిలీజ్ అయ్యాక వచ్చిన రెస్పాన్స్ చూసి షాకయ్యారట. సినిమాకు డబ్బులు సునామీ రూపంలో వస్తున్నా కూడా.. టిక్కెట్లు బీభత్సంగా తెగుతున్నా కూడా.. ఎందుకో ఆయనకు అందులోని బూతుపాళ్లు బాగా ఓవర్ అయిపోయాయ్ అనిపించి.. తన ఫిల్మోగ్రాఫీ నుండి ఈ టాకీస్ ను తీసేశారని టాక్.
ఇకపోతే సినిమాలో నటించిన కొంతమంది.. అలాగే ఇతర టెక్నీషియన్లు కూడా.. రిలీజ్ తరువాత ఎటువంటి ప్రమోషన్ చేయట్లేదు. కనీసం వాళ్ల ఫేసుబుక్కులో కూడా మాట్లాడట్లేదు. ఒకవేళ మాట్టాడితే మాత్రం.. ఈ బూతు డోస్ ఏంటి రాజా అని ఎవరన్నా అడుగుతారు.. ఖచ్చితంగా వారికి సమాధానం చెప్పాలి.