పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో 'ప్రాజెక్ట్ -కె' తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. సైన్స్ ఫిక్షన్ థ్రిలర్ నేపథ్యంలో సాగే ఓ టైమ్ ట్రావెల్ స్టోరీ అని ఇప్పటికే ప్రచారంలో ఉంది. భారీ యాక్షన్ సన్నివేశాలతో పాటు చిత్రాన్ని విజువల్ వండర్ గానూ హైలైట్ చేస్తున్నట్లు వినిపిస్తుంది.
అవతార్ తరహాలో ఓ సరికొత్త అనుభూతికి ప్రేక్షకులు లోనవుతాడని..వెండి తెరపై ఇంతవరకూ ఇలాంటి కథగానీ...పాత్రలుగానీ చూసి ఉండరంటూ! అంతకంతకు ప్రచారం ఠారెత్తిపోతుంది.
తాజాగా ఈ సినిమా స్టోరీ గురించి రచయిత సాయి మాధవ్ బుర్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. 'మీడియాలో సినిమాపై జరుగుతోన్న ప్రచారానికి- వాస్తవాలకు ఏ మాత్రం సంబంధం లేకుండా ఉంది. అంతా అనుకుంటున్నట్లు ఇది టైమ్ ట్రావెల్ స్టోరీ కాదు. ఓ కొత్త జోనర్ లో సాగే చిత్రమిది. ఇలాంటి కథను ఇంత వరకూ ఎవరూ తెరకెక్కించలేదు. ప్రేక్షకుల్ని థ్రిల్ చేసే అంశాలెన్నో ఉన్నాయి. పాత్రలన్ని చాలా కొత్తగా కనిపిస్తాయి' అని అన్నారు.
ఈ సినిమాకు సాయిమాధవ్ మాటలు రాస్తున్నారు. దీంతో టైమ్ ట్రావెల్ స్టోరీ అని జరుగుతోన్న ప్రచారానికి రచయిత ఖండనతో పుల్ స్టాప్ పడింది. ఇంకా ఆయన టాలీవుడ్ లో పలు బిగ్ ప్రాజెక్ట్ లకు పనిచేస్తున్నారు. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా శంకర్ తెరకెక్కిస్తోన్న చిత్రానికి మాటలు అందిస్తున్నారు.
ఇంకా సోషియా ఫాంటసీ చిత్రం 'హరిహర వీరమల్లు'.. సమంత ప్రధాన పాత్రలో నటిస్తోన్న 'శాకుంతలం' సినిమాలకు సంభాణలు అందిస్తున్నారు. అలాగే దర్శకత్వంపైనా తన ప్లానింగ్ని రివీల్ చేసారు. ప్రస్తుతానికి ఆ రకమైన ప్రయాణానికి దూరంగా ఉండాలనుకున్నట్లు తెలిపారు.
భవిష్యత్ లో దర్శకుడిగా ఓ కథని చెప్పాలనిపించినప్పుడు దాని గురించి ఆలోచిస్తాను. అంతవరకూ దర్శకత్వం అనే ఆలోచన రాదు. ఎక్కువగా రాజమౌళి సినిమాలకు పనిచేయాలని ఉంద'న్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.