బ్ర‌హ్మానందం స్ట్రేచ‌ర్ ఎంత అంటే?

Update: 2018-12-29 07:47 GMT
ప్ర‌స్తుతం టాలీవుడ్ లో మోస్ట్ అవైటెడ్ మూవీగా `ఎన్టీఆర్ బ‌యోపిక్` గురించి ప్ర‌చారం సాగుతోంది. ఈ బ‌యోపిక్ తొలి భాగం `క‌థానాయ‌కుడు` జ‌న‌వ‌రి 9న ప్ర‌పంచ‌వ్యాప్తంగా అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా రిలీజ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ  సంద‌ర్భంగా ఈ సినిమాకి సంబంధించిన ర‌క‌ర‌కాల సీక్రెట్స్ ని టీమ్ రివీల్ చేస్తోంది. ఇప్ప‌టికే ఈ చిత్రంలో ఏ పాత్ర‌లో ఎవ‌రెవ‌రు న‌టించారు? అన్న‌ది రివీలైంది. అయితే ఈ చిత్రంలో బ్ర‌హ్మానందం పాత్ర ఏంటి? అంటే దానికి తాజాగా స‌రైన స‌మాధానం దొరికింది. ఈ చిత్రానికి  మాట‌లు అందించిన స్టార్ రైట‌ర్ బుర్రా సాయిమాధ‌వ్ అందుకు సంబంధించిన టాప్ సీక్రెట్స్ ని రివీల్ చేశారు.

ఈ చిత్రంలో బ్రహ్మానందం ఒక లెజెండ‌రీ పాత్ర‌లో న‌టించారు. గ్రేట్ ఆర్టిస్ట్ రేలంగి పాత్ర‌లో ఆయ‌న‌ బ్ర‌హ్మాండంగా న‌టించార‌ని సాయి మాధ‌వ్ తెలిపారు. రేలంగి పాత్ర‌కు బ్ర‌హ్మానందం సూట‌య్యారా? అన్న ప్ర‌శ్న‌కు త‌న‌ దైన శైలిలో స‌మాధానం ఇచ్చారు. ప‌ద్మ‌శ్రీ రేలంగి పాత్ర‌లో న‌టించాలంటే ఒక స్ట్రేచ‌ర్ (స్థాయి) ఉండాలి. అది ఒక్క బ్ర‌హ్మానందంకు మాత్ర‌మే ఉంది. ఆ పాత్ర‌లో వేరొక న‌టుడిని ఊహించుకోలేం అనీ అన్నారు. బ్ర‌హ్మానందం తప్ప వేరొక ఆప్ష‌న్ లేనే లేద‌ని క‌రాఖండిగా చెప్పారు.  

అచ్చం రేలంగిని పోలి ఉండే జూనియ‌ర్ ఒక‌రు ఉన్నారు క‌దా?  ఆయ‌న్ని ఎందుకు తీసుకోలేదు? అని ప్ర‌శ్నిస్తే.. రేలంగి స్థాయిని స‌రితూగే వాళ్లు కావాలి. ఇమ్మిటేష‌న్ చేసేవాళ్ల‌ను లేదా స్థాయి త‌క్కువ‌గా ఉండే వాళ్ల‌ను ఆ పాత్ర‌లో ఊహించుకోలేమ‌ని అన్నారు. ఒక్కోసారి స్ట్రేచ‌ర్ కూడా చూడాల్సి ఉంటుంది. రేలంగి స్థాయి ఆర్టిస్టు విష‌యంలో ఆ స్ట్రేచర్ త‌ప్పనిస‌రి అని సాయిమాధ‌వ్ అన‌డం విశేషం.


Tags:    

Similar News