ఫెస్టివల్ హీరో శర్వానంద్ సినిమాలకు ప్రస్తుతం మార్కెట్ చాలా వరకు పెరుగుతూ వస్తోంది. మహానుభావుడు సినిమాతో బాక్స్ ఆఫీస్ హిట్ అందుకున్న శర్వా నెక్స్ట్ కూడా అలాంటి హిట్ అందుకోవాలని చూస్తున్నాడు. ప్రస్తుతం హను రాఘవపూడి దర్శకత్వంలో శర్వా ఒక సినిమాను చేస్తోన్న సంగతి తెలిసిందే. ఆ సినిమా పూర్తిగా రొమాంటిక్ కామెడీ తరహాలో తెరకెక్కనుంది. ఎక్కువగా నేపాల్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ ని నిర్వహించనున్నారు.
ఈ సినిమాలో శర్వా సరసన సాయి పల్లవి నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇద్దరి మధ్య కకెమిస్ట్రీ హైలెట్ అవుతుందని తెలుస్తోంది. ఇక లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే.. ఈ సినిమా టైటిల్ ఇదేనంటూ ఒక టాక్ గట్టిగా వినిపిస్తోంది. పడి పడి లేచే మనసు అనే టైటిల్ ని ఫిక్స్ చేయాలని దర్శకనిర్మాతలు చర్చించుకునుటున్నారట. ఇంకా ఫైనల్ గా ఫిక్స్ చేయలేదు గాని డైలాగ్స్ లో సందర్భానుసారం ఆ పేరును మైండ్ లో ఉంచుకున్నారట.
సినిమా కొంత వరకు పూర్తయ్యాక అప్పుడు ఏ టైటిల్ ఫిక్స్ చేయాలి అనే విషయంలో ఒక క్లారిటీకి వస్తారట. ఇక సినిమాను ప్రసాద్ చుక్కపల్లి మరియు సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా నిర్మిస్తుండగా కోలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించనున్నాడు. ఇంతకుముందు హను డైరెక్ట్ చేసిన కృష్ణగాడి వీర ప్రేమగాధ సినిమాకు విశాలే సంగీతం అందించాడు. ఆ సాంగ్స్ మంచి హిట్ అయ్యాయి. మరి ఇప్పుడు ఎంతవారకు హిట్ అవుతాయో చూడాలి.