సాయి పల్లవి.. సైలెంట్ గా జనాల్లో ఇలా..

Update: 2023-01-02 04:31 GMT
టాలెంటెడ్ హీరోయిన్ సాయి పల్లవి ఏ సినిమా చేసిన కూడా అందులో ఏదో ఒక కొత్త తరహా పాయింట్ ఉంటుంది అని ప్రేక్షకుల్లో ఒక మంచి నమ్మకం అయితే ఏర్పరచుకుంది. అయితే ఆమె కేవలం సినిమాలలోనే కాకుండా రియల్ లైఫ్ లో కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది. అనవసరమైన హడావిడికి వెళ్లకుండా ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి తరహాలోనే తన లైఫ్ ను ఎంజాయ్ చేస్తూ ఉంటుంది.

ఎక్కడ కూడా సంప్రదాయాలను దాటకుండా తనకు నచ్చిన విధంగా ఆమె ముందుకు సాగుతూ ఉంటుంది. అయితే సాయి పల్లవి రీసెంట్ గా న్యూ ఇయర్ రోజు ప్రత్యేకంగా కనిపించిన విధానం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది.

నిజానికి సాయి పల్లవి సింపుల్ గా ఉండేందుకు ఇష్టపడుతుంది అని అందరికి తెలిసిన విషయమే. అయితే న్యూ ఇయర్ రోజు చాలావరకు సినిమా స్టార్స్ వివిధ రకాలుగా పార్టీలలో ఎంజాయ్ చేస్తూ ఉంటారు.

కానీ సాయి పల్లవి మాత్రం అందుకు భిన్నంగా ఎలాంటి హడావిడి లేకుండా పుట్టపర్తి సాయిబాబా టెంపుల్ లో దైవారాధనలో బిజీగా ఉండడం విశేషం. ఇక ఆమెకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తెలుగుదనం ఉట్టిపడేలా సాంప్రదాయకరమైన పద్ధతిలో చీర కట్టుకుని ఆమె ధ్యానంలో ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఇక ఆమె సాధారణ జనాలతో పాటు సైలెంట్ గా కూర్చుని దైవారాధనలో లీనమైపోయింది.

ఇక సాయి పల్లవి తో పాటు ఆమె కుటుంబ సభ్యులు కొందరు అక్కడికి వచ్చినట్లుగా తెలుస్తోంది. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ సాయి పల్లవి తన పర్సనల్ లైఫ్ కు సంబంధించిన ఎలాంటి అలవాట్లు కూడా మార్చుకోలేదు. ఇక సాయి పల్లవి ఇంతవరకు బిగ్ స్కీన్ పై ఎలాంటి గ్లామర్ డోస్ పెంచకుండా తనదైన శైలిలో మాత్రమే మూవీస్ చేసుకుంటూ వెళుతుంది.

ఇక ప్రస్తుతం అయితే ఈ బ్యూటీ తమిళంలోనే కాకుండా మలయాళం తెలుగులో కూడా కొన్ని సినిమాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అలాగే ఆమె వద్దకు వెబ్ సిరీస్ ప్రాజెక్టులు కూడా వస్తున్నాయట. మరి సాయి పల్లవి ఈ ఏడాది ఎలాంటి విజయాలను అందుకుంటుందో చూడాలి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News