ఎంత పెద్ద స్టార్ సినిమా అయినా సరైన ప్రమోషన్స్ లేకపోతే సగటు ప్రేక్షకుడు థియేటర్ గేటు వైపు కూడా తొంగి చూడని పరిస్థితి. దీంతో ప్రతీ ఒక్కరూ సినిమా నిర్మాణంతో పాటు పబ్లిసిటీని కూడా ప్తర్యేకంగా చూస్తున్నారు. ఇందు కోసం భారీగా ఖర్చు చేస్తున్నారు. తమ సినిమా పట్ల ప్రేక్షకుల్లో అటెన్షన్ క్రియేట్ అయ్యేలా చూస్తున్నారు. కానీ క్రేజీ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న సాయి పల్లవి సినిమాని మాత్రం మేకర్స్ పట్టించుకోవట్లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
వివరాల్లోకి వెళితే... వివిధ కారణాల వల్ల ఏడాది ఆలస్యంగా విడుదలైన చిత్రం `విరాటపర్వం`. ఈ మూవీతో సాయి పల్లవి ప్రేక్షకుల ముందుకొచ్చింది. సీరియస్ గా సాగే సినిమా కావడంతో ఈ మూవీ కోసం జనాలు పెద్దగా థియేటర్లకు రాలేకపోయారు.
దీంతో టాక్ బాగున్నా సినిమా ఆశించిన స్థాయిలో వసూళ్లని రాబట్టలేకపోయింది. దీంతో సినిమా థియేటర్లలో వుండగానే నెట్ ఫ్లిక్స్ లోకి వచ్చేసింది. సురేష్ ప్రొడక్షన్స్, నిర్మాత చెరుకూరి సుధాకర్ భారీ స్థాయిలో ప్రచారం చేసినా ఫలితం లేకుండా పోయింది.
ఇదిలా వుంటే సాయి పల్లవి తాజాగా మరో కంటెంట్ ఓరియెంటెడ్ ఫిల్మ్ తో పప్రేక్షకులని పలకరించింది. ఆమె నటించిన లేటెస్ట్ మూవీ `గార్గి`. గౌతమ్ రామచంద్రన్ డైరెక్ట్ చేసిన తమిళ సినిమా ఇది. తెలుగులోనూ అదే పేరుతో డబ్బింగ్ చేశారు. అన్యాయంగా పోలీసులు అరెస్ట్ చేసిన తన తండ్రిని కాపాడుకునే క్రమంలో ఓ స్కూల్ టీచర్ జరిగే న్యాయ పోరాటం నేపథ్యంలో ఈ మూవీని రూపొందించారు. జూలై 15న విడుదలైన ఈ మూవీకి పబ్లిసిటీ కరువైందని విమర్శలు వినిపిస్తున్నాయి.
సినిమాపై విమర్శల నుంచి, సగటు ప్రేక్షకుల నుంచి మౌత్ టాక్ పాజిటివ్ గా వున్నా దాన్ని మేకర్స్ నిలబెట్టుకోలేకపోతున్నారని కామెంట్ లు పడుతున్నాయి. కోర్ట్ రూమ్ డ్రామాగా ఓ టీజర్ ఎమోషనల్ జర్నీగా సరికొత్త నేపథ్యంలో రూపొందిన ఈ మూవీ ప్రమోషన్స్ లేకపోవడంతో పెద్దగా జనాలకు రీచ్ కాలేకపోతోందని, ఈ విషయంలో మేకర్స్ శ్రద్ధ చూపించకపోవడమే ప్రధాన కారణంగా మారిందని చెబుతున్నారు.
సినిమా టాక్ బాగున్నా మంచి వసూళ్లని, ఓపెనింగ్స్ ని రాబట్టలేకపోవడానికి ప్రమోషన్స్ ఓ కారణం కాగా.. ఇటీవల కురిసిన వర్షాలు కూడా ప్రధాన కారణంగా నిలిచాయని నెట్టింట కామెంట్ లు వినిపిస్తున్నాయి. మూవీతో పాటు విడుదలైన రామ్ మూవీ `ది వారియర్` కొంత డివైట్ టాక్ ని సొంతం చేసుకున్నా దాన్ని సాయి పల్లవి మూవీకి అడ్వాంటేజ్ గా మార్చుకోలేకపోయారని అంటున్నారు.