మెగాస్టార్ చిరంజీవి డాన్స్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే... ఎంతగా చెప్పినా ఇంకా మిగిలే ఉంటుంది. కొన్ని వందల ఐకానిక్ స్టెప్పులను చిరంజీవి చేసి ఎంతో మంది యంగ్ స్టార్ హీరోలకు ఆదర్శంగా నిలిచాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాంటి మెగాస్టార్ డాన్స్ గురించి ఆయన ఐకానిక్ స్టెప్స్ గురించి లేడీ పవర్ స్టార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
ఈమద్య కాలంలో లేడీ పవర్ స్టార్ గా అభిమానుల్లో అద్బుతమైన స్టార్ డమ్ ను.. ఫాలోయింగ్ ను దక్కించుకున్న ముద్దుగుమ్మ సాయి పల్లవి. ఈ అమ్మడు నటించిన విరాట పర్వం సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. మూడు నాలుగు సంవత్సరాలుగా విరాటపర్వం కోసం అభిమానులు వెయిట్ చేస్తున్నారు.
ఎట్టకేలకు విడుదల కాబోతున్న విరాటపర్వం విడుదల సందర్భంగా ప్రమోషన్ కార్యక్రమాల్లో సాయి పల్లవి పాల్గొంటుంది. ఆ సందర్భంగా చిరంజీవి డాన్స్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలను చేసింది.
విరాటపర్వం సినిమా ప్రమోషన్ లో భాగంగా ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో పాల్గొంది. రాధాకృష్ణ పలు విషయాలను ఆమె నుండి రాబట్టారు. ప్రోమో లో ఆసక్తికర విషయాలు ఇంటర్వ్యూలో చర్చించినట్లుగా చూపించారు. సాయి పల్లవి ఇంటర్వ్యూ తో కూడా చాలా క్యూట్ గా అనిపించి ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది.
కాళ్లను కూడా కనిపించకుండా కవర్ చేసుకుంటూ కూర్చున్న ఆమె తీరును రాధాకృష్ణ అభినందించాడు. ప్రోమో లో సాయి పల్లవి మాట్లాడుతూ.. చిరంజీవి గారి ముఠామేస్త్రీ హుక్ స్టెప్ ను ఎన్నో సార్లు ప్రయత్నించాను. కాని ఎప్పుడు కూడా పర్ఫెక్ట్ గా రాలేదు. అలాగే నడక కలిసిన నవరాత్రి పాట స్టెప్ ను కూడా చాలా సార్లు ట్రై చేశాను అంటూ చెప్పుకొచ్చింది.
విరాటపర్వం ప్రమోషన్ లో భాగంగా సాయి పల్లవి పలు కార్యక్రమాల్లో పాల్గొంటుంది. ప్రతి చోట కూడా ఆమెకు అనూహ్య స్పందన దక్కుతోంది. పాన్ ఇండియా స్థాయిలో మంచి గుర్తింపు దక్కించుకున్న సాయి పల్లవి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయక పోవడం పై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. సాయి పల్లవి వరుస సినిమాలు చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.