సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ జెట్ స్పీడ్ తో సినిమాలు చేస్తున్నాడు. రేపు 'సోలో బ్రతుకే సో బెటర్' విడుదల అవుతుండగా నేడు గురువారం కొత్త సినిమాని పూజా కార్యక్రమాలతో ప్రారంభించాడు. మిస్టికల్ థ్రిల్లర్ కథాంశంతో రాబోతున్న ఈ చిత్రానికి 'భమ్ బోలేనాథ్' ఫేమ్ కార్తీక్ వర్మ దండు దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రానికి స్టార్ డైరెక్టర్ సుకుమార్ స్క్రీన్ ప్లే అందించడం విశేషం. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బీవీఎస్‌ఎన్ ప్రసాద్ మరియు సుకుమార్ రైటింగ్స్ పతాకంపై సుకుమార్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
నేడు హైదరాబాద్ లోని సంస్థ కార్యాలయంలో #SDT15 చిత్రాన్ని పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించారు. దేవుడి పటాలపై హీరో సాయి ధరమ్ తేజ్ క్లాప్ కొట్టగా.. ప్రొడ్యూసర్ స్క్రిప్ట్ ని దర్శకుడి చేతికి అందించారు. సాయి తేజ్ తన కెరీర్ లో మొదటిసారిగా మిస్టికల్ థ్రిల్లర్ జోనర్ లో నటించనున్నాడు. ''సిద్ధార్థ నామ సంవత్సరే.. బృహస్పతి : సింహరాశౌ... స్థిత సమయే.. అంతిమ పుష్కరే'' అంటూ అనౌన్క్ మెంట్ పోస్టర్ లోనే ఇదొక డిఫరెంట్ కాన్సెప్ట్ తో రూపొందే సినిమా అని హింట్ ఇచ్చారు. హిట్ ప్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తున్న తేజ్ కి ఈ ఆధ్యాత్మిక థ్రిల్లర్ ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి. భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న #SDT15 చిత్రానికి సంబంధించిన నటీనటులు సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు.