మెగా హీరోల నడుమ సరైన సాన్నిహిత్యం లేదని మెగా - అల్లు హీరోలు వ్యత్సాసాలు ఈగోలతో దూరంగా ఉంటున్నారని రకరకాల ప్రచారం సాగింది మీడియాలో. చిరంజీవి.. పవన్ కల్యాణ్ బ్రదర్స్ డివైడ్ అంటూ కూడా ప్రచారం సాగింది. నాగబాబును ఈ గొడవలోకి లాగిన సందర్భాలున్నాయి. అయితే వీటన్నిటికీ మెగా ఫ్యామిలీ గంపగుత్తగా టోకున ఆన్సర్లు ఇస్తోంది.
పండగలు పబ్బాల వేళ కుటుంబ పెద్ద అయిన మెగాస్టార్ చిరంజీవి సమక్షంలో మెగా హీరోలంతా కలుస్తున్నారు. మెగా కుటుంబాలన్నీ కలుస్తున్నాయి. అలా ఇప్పటికే `మేమంత ఒక్కటే.. కలిసే ఉన్నాం!`` అని ఆన్సర్ ఇచ్చేసినా.. ఇటీవల జరిగిన రామ్ చరణ్ బర్త్ డే వేడుకలో సాయి తేజ్ ఇచ్చిన వివరణ మరింత క్లారిటీగా ఉంది.
గత కొద్దికాలంగా మాపై కొందరు పనిగట్టుకొని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. విమర్శిస్తున్నారు. కానీ మమల్ని ద్వేషించే వారికి మేం ఇచ్చేది ప్రేమ ఒకటే! అంటూ ఫైరయ్యారు. మమల్ని ద్వేషించే వారెవరో మనకు తెలుసు అని సాయి తేజ్ ఎమోషనల్ అయ్యారు. మెగాస్టార్ అనే వృక్షం నీడలోనే చరణ్-బన్ని-నేను- ఇతర మెగా హీరోలంతా పుట్టారు. మేమంతా ఒకటే అని అన్నారు. అభిమానులైన మీకెప్పుడు దాసులుగా ఉంటాం అని సాయి తేజ్ పేర్కొన్నారు. యంగ్ మేనల్లుడు ఎంతో ఎనర్జిటిక్ గా ఎమోషనల్ గా స్పీచ్ ఇవ్వడంతో అది కాస్తా మీడియాలోనూ వైరల్ గా మారింది. మమ్మల్ని ద్వేషించి మాపై విష ప్రచారం చేసేదెవరో కూడా తెలుసునని అనడంతో అక్కడ సీన్ కూడా కాస్త వేడెక్కింది.