సుశాంత్ పై కుట్ర వ్యాఖ్య‌ల్ని ఖండించిన ఖాన్!

Update: 2020-06-16 10:10 GMT
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మ‌ర‌ణం‌పై సినీ పరిశ్రమ ఆకస్మికంగా ప్రేమను వ్యక్తం చేయడంపై బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ సీరియ‌స్ అయ్యారు. ``ఎంతో శ్రద్ధగా నటిస్తున్నారు.. అయినా వంచన కన్నా ఒక రోజు నిశ్శబ్దంగా ఉండ‌డం స‌రైన‌ది`` అని ఆయన అభిప్రాయపడ్డారు.

తాజా ఇంటర్వ్యూలో సుశాంత్ మరణ వార్త `కేవలం భయంకరమైన‌ది` అని అభిప్రాయ‌ప‌డ్డారు. విషాదం నేపథ్యంలో చెత్త మాట్లాడ‌వ‌ద్ద‌ని హిత‌వు ప‌లికే ప్ర‌య‌త్నం చేశాడు. ఘ‌ట‌న జ‌రిగిన వెంట‌నే చాలా త్వరగా అన‌వ‌స‌ర వ్యాఖ్యలు చేసిన వారు చాలా మంది ఉన్నారు. ఈ పేద సాటి న‌టుడి విషాదం నుండి ఇత‌రులు మైలేజ్ పొందేందుకు ప్ర‌య‌త్నించార‌ని అనిపిస్తోంద‌ని త‌ప్పు ప‌ట్టారు సైఫ్‌. ఇది కరుణ చూపడం లేదా కొంత రాజకీయ వైఖరిని చూపించడమేన‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. సోషల్ మీడియాల్లో నాన్ స్టాప్ గా చెత్త మాట్లాడుతున్నారు. ఇది ఇబ్బందికరం అని సైఫ్ అన్నారు.

సుశాంత్ పై గౌరవం విషాదం వేళ నిశ్శబ్దంగా ఉండ‌డం లేదా ఆత్మపరిశీలన చేసుకుంటే ఉత్త‌మంగా ఉండేద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. ఇంత‌కుముందు అతనిని పట్టించుకోని వారు.. ఇక‌పైనా వేరే ఎవ‌రినీ ప‌ట్టించుకోరు అని అన్నారు.

సినీప‌రిశ్ర‌మ‌లో పోటీ త‌త్వం ఉంటుంది. సుశాంత్ అనే నెపంతో తనకు అవమానం జరిగిందని సైఫ్ అన్నారు. ``మేం ఎవరి గురించి పట్టించుకోమ‌ని మీకు తెలుసా? ఇది ఇత‌రుల్ని హ‌ర్ట్ చేయ‌డ‌మే. మీరేదో ప‌ట్టించుకుంటార‌ని..అత‌డి విష‌యంలో శ్రద్ధ వహిస్తార‌ని నటించడం ఆత్మ‌ వంచన లాంటిది. ఇది చనిపోయినవారికి అవమానం అని నేను భావిస్తున్నాను. సుశాంత్ ఆత్మకు అవమానం`` అని ప‌టౌడీ స్టార్ సీరియస్ అయ్యారు.

అకస్మాత్తుగా సుశాంత్ పట్ల ప్రేమను ప్రదర్శించడం జీర్ణించుకోవడం క‌ష్ట‌మేన‌ని అన్నారు సైఫ్‌. ``ఈ పట్టణంలో ఎవరూ నిజంగా పట్టించుకోనప్పటికీ... సానుభూతితో ఫ్యాన్స్ పెర‌గాలని కోరుకుంటున్నార``ని సైఫ్ దుయ్య‌బ‌ట్టారు. సుదీర్ఘమైన సోషల్ మీడియా పోస్టులు రాసే వ్యక్తులు నిజ జీవితంలో అదే స్థాయిలో ప్రేమను కరుణను చూపించే అవకాశం లేదని ఆయన అన్నారు.

సినీ పరిశ్రమ పెద్ద‌లు సుశాంత్ ని కాపాడ‌డంలో విఫ‌ల‌మ‌య్యార‌ని శేఖ‌ర్ క‌పూర్ .. అనుభ‌వ్ సిన్హా.. కంగ‌న ర‌నౌత్ వంటి ప్ర‌ముఖులు తీవ్ర వ్యాఖ్య‌లు చేసిన వెంట‌నే సినీపెద్ద‌ల్లో ఒక‌రైన‌ సైఫ్ ఖాన్ ఇలా స్పందించ‌డం ఆస‌క్తిక‌రం. అయితే వీళ్లంద‌రి వ్యాఖ్య‌ల్ని సైఫ్ పూర్తిగా అంగీకరించలేదు. ఎవ‌రో ఒక‌రిని ల‌క్ష్యంగా చేసుకుని విమ‌ర్శించేందుకు ఇలా సుశాంత్ పేరును పాడు చేయ‌డం స‌రికాద‌ని సైఫ్ అన్నారు. ఎవ‌రి వ‌ల్ల సుశాంత్ న‌ష్ట‌పోయాడో తెలిస్తే బ‌య‌టికి చెప్పండి అని సైఫ్ స‌వాల్ విసిరారు.

ఇది లాక్ డౌన్ వ‌ల్ల‌.. సోషల్ మీడియాల‌ అని నా అభిప్రాయం. సినిమా ప్రజలు సినిమాలకు మించి ఆలోచించకపోవడం విచారకరం. సినీ కెరీర్ వ‌ల్ల ఇలా జ‌రిగింది అనుకుంటే పొర‌పాటు. జీవితానికి ఇంకా కావాల్సిన‌ది చాలా ఉంది. బహుశా అతను తన జీవితంలో ఇతర విషయాల గురించి కలత చెందాడు. బహుశా అది వ్యక్తిగత కారణం కావచ్చు. ఇది సినీప‌రిశ్ర‌మ‌తో సంబంధం లేనిది. మీరు అంతకు మించి చూడలేకపోవ‌డం స‌రి కాదు`` అని సైఫ్ అభిప్రాయ‌ప‌డ్డారు.

సైఫ్ డాట‌ర్ సారా అలీఖాన్ స‌ర‌స‌న సుశాంత్ `కేదార్ నాథ్‌` చిత్రంలో న‌టించిన సంగ‌తి తెలిసిందే. ఆ క్ర‌మంల‌నే సుశాంత్ గురించి సైఫ్ చాలా తెలుసుకున్నార‌ట‌. సుశాంత్ గొప్ప‌గా నేర్చుకునే హీరో అని.. తత్వశాస్త్రం .. ఇంజనీరింగ్ పై వివిధ అంశాలను చర్చించగలడని సైఫ్ అన్నారు.  విల్లు - బాణం ఉప‌యోగించ‌డం.. అలాగే ఎడమ చేతితో ఎలా తుపాకీతో కాల్చాలో నేర్చుకున్నాడని తెలిపారు. సుశాంత్ ఎంతో గొప్ప వ్య‌క్తి అని సారా త‌న‌కు చెప్పింద‌ని తెలిపారు సైఫ్‌.

ఇక సుశాంత్ మంచిత‌నం గురించి చెబుతూ.. ఈ ప్ర‌పంచం ఫెయిర్ గా ఉండ‌దు. ఏ ప‌రిశ్ర‌మ‌లో అయినా క‌ష్టాలుంటాయి. సినీప‌రిశ్ర‌మ‌లోనూ క‌ష్టాలు త‌ప్ప‌వు. ఎవ‌రైనా బ‌య‌టి వ్య‌క్తులు ప‌రిశ్ర‌మ‌కు వ‌చ్చిన‌ప్పుడు బ్యాక్ గ్రౌండ్ ఉన్న వాళ్ల కంటే ఎక్కువ క‌ష్టాలు ఎదుర‌వుతుంటాయి. అయితే వాటిపై ఫైట్ చేయాలి కానీ ఫీల‌య్యేలా ఉండ‌కూడ‌దు. అవ‌కాశాలు వ‌చ్చి పోతూ ఉంటాయి. అయినా వెతుక్కోవాలి. అంద‌రికీ దాదాపు ఇలాంటి క‌ష్టాలే ఉంటాయి.. అంటూ ప్ర‌ఖ్యాత న‌టుడు మ‌నోజ్ భాజ్ పాయ్ అభిప్రాయ‌ప‌డ్డారు. సుశాంత్ వ్య‌క్తిగ‌త కార‌ణాల వ‌ల్ల మ‌న‌స్థాపం చెందాడా?  లేక సినిమా కెరీర్ ప‌రంగా క‌ల‌త చెందాడా? అన్న‌ది మ‌న‌కు తెలీనే తెలీదు.. అని మ‌నోజ్ భాజ్ పాయ్ అభిప్రాయ‌ప‌డ్డారు.
Tags:    

Similar News