అక్కినేని నాగచైతన్య తాజా చిత్రం 'శైలజారెడ్డి అల్లుడు' వినాయకచవితి పండగ సందర్భంగా నిన్నే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫస్ట్ డే తెలుగు రాష్ట్రాల్లో రూ.5.60 కోట్ల షేర్ సాధించిన ఈ చిత్రం చైతన్య కెరీర్ బెస్ట్ ఓపెనర్ గా నిలిచింది. మరోవైపు ఈ సినిమా రెండు రోజు కలెక్షన్స్ కూడా డీసెంట్ గా ఉన్నాయి.
రెండో రోజు 'శైలజారెడ్డి అల్లుడు' ఆంధ్ర ప్రదేశ్ - తెలంగాణా రాష్ట్రాల్లో రూ. 2.18 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. దీంతో రెండు రోజులకు గాను తెలుగు రాష్ట్రాల్లో రూ. 7.78 టోటల్ షేర్ నమోదు చేసింది. మొదటి రోజు కంటే రెండో రోజు కలెక్షన్స్ యాభై శాతంపైగా డ్రాప్ ఉన్నప్పటికీ శనివారం.. ఆదివారం సెలవులు కాబట్టి మెరుగైన వీకెండ్ కలెక్షన్స్ నమోదు చేసే అవకాశాలు ఉన్నాయి.
వీకెండ్ పూర్తయ్యేసరికి తెలుగు రాష్ట్రాల్లో 10 కోట్ల షేర్ మార్క్ ను దాటడం లాంఛనమే. సినిమా బడ్జెట్ ను బట్టి చూస్తే ఈ సినిమా సేఫ్ జోన్ లోకి వెళ్తుందా లేదా అనేది ఇప్పుడే చెప్పడం కష్టం. మొదటి సోమవారం సినిమాకు వచ్చే కలెక్షన్స్ బట్టి 'శైలజా రెడ్డి అల్లుడు' ఫుల్ రన్ కలెక్షన్స్ పై ఒక అంచనాకు రావచ్చు. ఇక 'శైలజారెడ్డి అల్లుడు' సినిమాకు కాంపిటిషన్ లో రిలీజ్ అయిన 'U టర్న్' ఎ సెంటర్స్ లో మల్టిప్లెక్స్ ల్లో మాత్రమే మంచి రెస్పాన్స్ వుంది. దీంతో 'శైలజారెడ్డి అల్లుడు' సినిమాకు అది ప్లస్సే.
ఇక 'శైలజారెడ్డి అల్లుడు' రెండో రోజు ఏరియా వైజ్ కలెక్షన్స్ పై ఒక లుక్కేయండి.
నైజాం - 0.67 Cr
సీడెడ్ - 0.45 Cr
ఉత్తరాంధ్ర - 0.28 Cr
గుంటూరు - 0.20 Cr
కృష్ణ - 0.16 Cr
వెస్ట్ - 0.14 Cr
ఈస్ట్ - 0.18 Cr
నెల్లూరు - 0.10 Cr
Total - రూ. 2.18 Cr (AP + TS )