అక్కినేని నాగ చైతన్య హీరోగా మారుతీ దర్శకత్వంలో రూపొందిన శైలజారెడ్డి అల్లుడు ఆడియో విడుదల ఈ ఆదివారం జరగాలి. దానికి తగట్టు పబ్లిసిటీ కూడా మొదలుపెట్టి సదరు టీవీ చానెల్స్ లో టైం కూడా ప్రకటించారు. కానీ తాజా అప్ డేట్ ప్రకారం ఇది వాయిదా పడనుంది. ఈ నెల 22న ఆడియో బదులు ప్రీ రిలీజ్ ఫంక్షన్ చేసి ఆన్ లైన్ లో నేరుగా ఫుల్ ఆడియో వదిలే నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. దీన్ని చైతు స్వయంగా ప్రకటించే అవకాశం ఉంది. దీనికి పలు కారణాలు ఉన్నాయి. మారుతీ ప్రస్తుతం ఇక్కడ లేడు. కేరళలో చిక్కుకున్నాడు. వరదల ప్రభావం తగ్గి ఇక్కడికి చేరుకోవడానికి కనీసం ఓ మూడు రోజుల టైం పడుతుందట. దర్శకుడు లేకుండా చేయటం భావ్యం కాదు. పైగా ఆడియో రిలీజ్ కంటే ప్రీ రిలీజ్ అయితేనే హైప్ బాగా వస్తుంది అనే ఆలోచన కూడా దీనికి కారణమని చెబుతున్నారు. ఇప్పటికే విడుదలైన మొదటి ట్రాక్ భీభత్సం అనే రేంజ్ లో కాదు కానీ జస్ట్ పాస్ అనిపించుకుంది అంతే. ఈ నేపథ్యంలో అన్ని పాటలు వదలటం కంటే ట్రైలర్ తో హైప్ ని పెంచే ప్రయత్నం బెటర్ అనుకున్నారు కాబోలు.
ఒకరకంగా చెప్పాలంటే ఇది మంచి నిర్ణయమే. మారుతీ వరదల్లో చిక్కుకోవడంతో పాటు అటల్ బిహారీ వాజ్ పాయ్ మరణంతో అంతటా విషాదం నెలకొంది. అధికారంలో ఉంది బిజెపి పార్టీ కాబట్టి సంతాపం వాతావరణం ఎక్కువగా ఉంటుంది. సో ఇప్పుడు సినిమా పేరుతో హంగామా చేయటం కూడా కరెక్ట్ కాదు. మొత్తానికి అల్లుడు ఇచ్చిన కొత్త ట్విస్ట్ మరికాసేపట్లో అధికారికంగా తెలియనుంది. టీజర్ తో అంచనాలు ఇప్పటికే పెరిగిపోగా మొదటి సారి చైతు ఫుల్ మాస్ అవతారంలో కనిపిస్తున్నాడు. అను ఇమ్మానియేల్ జోడిగా నటించిన ఈ మూవీలో అత్తయ్యగా రమ్య కృష్ణ ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నారు. ఈ నెల 31 విడుదలలో మాత్రం ఎలాంటి మార్పు ఉండటం లేదు. అన్నట్టు ఇప్పుడు మారిన ప్రీ రిలీజ్ ఫంక్షన్ తేదీ చిరంజీవి పుట్టిన రోజు కావడం విశేషం.