యంగ్ ట్యాలెంట్ అడవి శేషు గురించి పరిచయం అవసరం లేదు. మల్టీ ట్యాలెంటెడ్ పర్సనాల్టి. నటుడిగా..రచయితగా..దర్శకుడిగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు. కంటెంట్ బేస్డ్ చిత్రాలకు పెట్టింది పేరుగా నిలుస్తున్నాడు. మూసలో వెళ్తోన్న టాలీవుడ్ గమనాన్ని మార్చిన నటుడిగా శేషు పేరు ముందు వరుసలో ఉంటుంది.
అతని స్ఫూర్తితో మరింత మంది యంగ్ స్టార్స్ మారారు. ఎలాంటి సినిమాలు చేస్తే జనాలు చూస్తారు? అన్న ఓ ఐడియాని క్రియేట్ చేయగలిగాడు. ఆ విషయంలో శేషు చాలా మంది కి స్ఫూర్తి అనొచ్చు. సాక్షాత్తు మహేష్ సైతం అతని ప్రతిభని మెచ్చిన సందర్భం ఉంది. త్వరలో 'హిట్-2' తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. హిట్ సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కుతోన్న సినిమాపై భారీ అంచనాలున్నాయి.
శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్న సినిమా పాన్ ఇండియా లో రిలీజ్ అవుతోంది. 'మేజర్' సినిమాతో హిందీలోనూ శేష్ ఫేమస్ అవ్వడంతో సినిమాకి అక్కడా మంచి బిజినెస్ జరుగుతోంది. అయితే శేషు తో సినిమా చేయడం దర్శకులకు ఇబ్బంది కరంగా ఉంటుందని చాలా కాలంలో ఓ విమర్శ ఉంది. అతను కథలో వేలు పెడతాడని..తాను అనుకున్నదే దర్శకుడు పాటించాలని ఇలా కొన్ని విమర్శలు శేష్ పై ఉన్నాయి.
తాజాగా వీటిపై అతనితో కలిసి పనిచేసిన శైలేష్ కొలను వివరణ ఇచ్చే ప్రయత్నం చేసాడు. 'ఈ కథతో శేషు దగ్గరకు వెళ్దాం అనుకుంటే చాలా మంది వద్దు అని సలహాలు ఇచ్చారు. మనోడు కథలో వేలు పెడతాడు. నీ కథని మార్చేసి మళ్లీ అన్ని తనే రాసుకుంటాడన్నారు. దీంతో తొలి మీటింగ్ నా కథ నచ్చుంతుందా? లేదా? అని సందేహం వచ్చింది.
కానీ తనకు కథ బాగా నచ్చింది. సెట్స్ లో తనెంతో ప్రోఫెషనల్ గా ఉంటాడు. నేను సృష్టించిన కేడీ అనే పాత్ర ఎలా ఉండాలనుకున్నానో అంతకు మించి నాలిగింతలు గొప్పగా వచ్చింది. హిట్ వెర్స్ కి వచ్చిన ఆదరణ చూసి ఆశ్చర్యమేసింది.
ఈ హిట్ యూనివర్స్ ఇంకా గొప్పగా చేయాలనే స్పూర్తిని నింపింది. దానికి కారణం శేషు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అప్పుడే అర్ధమైంది శేషు గురించి నేను విన్నది అంతా అబద్దం అని. సినిమాపై టీమ్ అంతా చాలా కాన్పిడెంట్ గా ఉన్నామని' తెలిపారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.