కొన్నాళ్లగా బాలీవుడ్ పరిశ్రమ కి సరైన హిట్ లేక విలవిలలాడుతోన్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ చిత్రాలకన్నా చిన్న చిత్రాలే మంచి ఫలితాలు సాధించి ఉన్న పరిస్థితి నుంచి కాస్త అయినా ఊరటనిస్తున్నాయి. స్టార్ హీరోలంతా ఒకరి వెంట ఒకరు ఫెయిల్యూర్స్ తో క్యూ కడుతున్నారు. ఈ క్రమంలోనే కొంత మంది హిందీ హీరోలు తెలుగు మార్కెట్ పైనే దృష్టిసారించడం మొదలు పెట్టారు.
తమ సినిమాల్ని తెలుగులో ప్రమోట్ చేసుకునేందేకు ఇక్కడి హీరోల సహకారం కోరుతున్నారు. ఇక హిట్ కంటెంట్ ఎలాగూ హిందీ లో రీమేక్ అవుతుంది. అవసరమైన చిత్రాలు ఉ్తరాదిన రీమేక్ అవుతున్నాయి. అయితే ఇటీవల కాలంలో ఆ రీమేక్ ల తంతు మరీ ఎక్కువైంది. తాజాగా ఈ పరిస్థితి చూసి హిందీ అభిమానులు అక్కడ హీరోల్ని...దర్శక-రచయిత నిర్మాతల్ని తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది.
అదీ ఈ విషయాన్ని ఓ తెలుగు దర్శకుడు చెప్పడం విశేషం. యంగ్ మేకర్ శైలేష్ కొలను 'హిట్' చిత్రంతో ఎంత ఫేమస్ అయ్యాడో చెప్పాల్సి పనిలేదు. ఇదే చిత్రాన్ని హిందీలో రీమేక్ చేసి అక్కడా సక్సెస్ అందుకున్నారు. మరి త్వరలో రిలీజ్ కానున్న హిట్-2ని కూడా అక్కడ రీమేక్ చేస్తారా? అంటే? ...
'ఇక రీమేక్ లు చేయను. ఒకవేళ హిందీలో హిట్ కథలే చేయాలనుకుంటే ..మరో కొత్త కథని తీస్తా. అంతేకాని రీమేక్ లు జోలికి వెళ్లను. ఎందుకంటే రీమేక్ లు చేస్తుంటే అక్కడ జనాలు తిడుతున్నారు. దక్షిణాదిలో ఎవరో ఓ మంచి కథ చేస్తే దాన్ని ఇక్కడ రీమేక్ చేస్తున్నాడు చూడు అంటున్నారు. అక్కడ చేసింది నేనే అని చెప్పుకున్నా ఒప్పుకోవడం లేదు.
అంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. థియేటర్ లో రిలీజ్ అయిన సినిమా ఓటీటీలో పెద్ద గ్యాప్ లేకుండా రిలీజ్ అవుతుంది. అలాంటప్పుడు రీమేక్ చేసి సాధించేది ఏముటుంది. అందుకే ఇక రీమేక్ ల జోలికి వెళ్లను. ఏదైనా కొత్త ప్రయత్నం చేస్తాను.
కొత్తగా చెప్పడానికి ఎక్కువగా పనిచేస్తాను' అని అన్నారు. క్రియేటివ్ పరంగా బాలీవుడ్ విధానం కూడా మారాలని నిపుణులు విశ్లేషించిన సంగతి తెలిసిందే. కంటెంట్ రొటీన్ గా ఉంటుందని....మూలాలు మర్చిపోయి సినిమాలు చేస్తున్నారని కంగన రనౌత్ సహా పలువురు ఎద్దేవా చేసారు. మరి ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఎలాంటి మార్పులు చేస్తారో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.