కల్పితాలతో నిండిన వాస్తవ కథ సైరా

Update: 2019-10-04 09:59 GMT
రాయలసీమలో రెండు - మూడు జిల్లాల్లో తప్ప ఎవరికీ తెలియని స్వాతంత్య్ర సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గురించి ఇప్పుడు దేశమంతా తెలిసేలా చేసింది సైరా నరసింహారెడ్డి సినిమా. నరసింహారెడ్డి కథని తెరకెక్కించాలని కథా రచయితలు పరుచూరి బ్రదర్స్ దాదాపు 20 సంవత్సరాల నుండి ఎదురుచూస్తున్నారు. తన తండ్రికి కూడా ఇలాంటి సినిమాలో నటించాలని ఉందని తెలుసుకున్న రాంచరణ్ తానే నిర్మాతగా సైరా సినిమాని భారీ స్థాయిలో నిర్మించాడు. ఇప్పుడు విడుదలైన ఈ సినిమా అన్ని చోట్ల పాజిటివ్ టాక్ తో రన్ అవుతుంది.

అయితే ఇప్పుడు ఇండస్ట్రీలో ఇంకొక టాక్ బయటకి వచ్చింది. ఇది పరుచూరి బ్రదర్స్ రాసిన ఒరిజినల్ స్టోరీ కాదని అంటున్నారు. పరుచూరి బ్రదర్స్ కథ విని చిరంజీవి ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నారు. ఆ తర్వాత దర్శకుడిగా సురేంద్రరెడ్డిని పెట్టుకోవడంతో స్క్రిప్ట్ మొత్తాన్ని తన చేతుల్లోకి తీసుకున్న సురేంద్రరెడ్డి... బుర్రా సాయి మాధవ్ లాంటి డైలాగ్ రైటర్ - సత్యానంద్ లాంటి రచయితలతో కలిసి కథని పూర్తిగా మార్చేశాడు. చిరంజీవి ఇమేజ్ కి తగ్గట్టు కథలో లేని కమర్షియల్ ఎలిమెంట్స్ ని సురేంద్రరెడ్డి కథలో జోడించాడు. నరసింహారెడ్డి జీవితంలో జరగని చాలా కల్పితాలు ఈ సినిమాలో జరిగినట్టు చూపించాడు సురేంద్రరెడ్డి.

ఇంతకుముందు కూడా ఇది పరుచూరి బ్రదర్స్ స్క్రిప్ట్ కాదని ఒక సందర్భంలో సురేంద్రరెడ్డి చెప్పాడు. అంటే ఇప్పుడు మనం చూస్తున్నది ఒక కమర్షియల్ సినిమా. ఇది సినిమా చూసిన ఎవరికైనా అర్ధం అవుతుంది.

   


Tags:    

Similar News