సాక్షి వైద్య .. అబ్బాయిలు కొత్త క్రష్

Update: 2022-07-20 17:30 GMT
ఇటీవల కాలంలో వెండితెరకు మొదటిసారి పరిచయం అవుతున్న కొంతమంది హీరోయిన్స్ మొదటి చూపుల్లోనే కుర్రాలను ఎంతగానో ఆకట్టుకుంటున్నారు. ఇక ఏజెంట్ సినిమా ద్వారా మొదటి సారి తెలుగు చిత్ర పరిశ్రమ లోకి అడుగుపెడుతున్న సాక్షి వైద్య కూడా ఫస్ట్ లుక్ తోనే ఎంతగానో ఆకట్టుకుంటుంది.

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ అక్కినేని హీరోగా నటిస్తున్న స్పై యాక్షన్ అడ్వెంచర్ సినిమా ఏజెంట్ సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్న ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

ఇటీవల విడుదలైన ఫస్ట్ టీజర్ కూడా భారీ స్థాయిలో రెస్పాన్స్ అందుకుంది. తప్పకుండా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఊహించని రేంజ్ లో సక్సెస్ అవుతుంది అని ప్రేక్షకులలో గట్టి నమ్మకం అయితే ఉంది. ఇక టీజర్ లో అయితే ఒకే ఒక్క డైలాగ్ తో హీరోయిన్ సాక్షి వైద్య నేటి తరం కుర్రాళ్లను ఎంతగానో ఎట్రాక్ట్ చేసింది. వైల్డ్ సాలే అంటూ హీరోను ముద్దుగా పిలిచిన ఈ బ్యూటీ తన హావ భావాలతో కూడా ఆకట్టుకుంది.

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ బ్యూటీ కి సంబంధించిన ఫోటోలు కూడా  వైరల్ అవుతున్నాయి. ఇదివరకే ఇన్స్టాగ్రామ్ లో భారీగా ఫ్యాన్స్ ఫాలోవర్స్ ను పెంచుకున్న ఈ బ్యూటీ ఇప్పుడు ఏజెంట్ సినిమా ద్వారా వన్ మిలియన్ ఫాలోవర్స్ కు దగ్గరలో ఉంది. ఒక విధంగా ప్రస్తుతం ఈ బ్యూటీ హడావిడి చూస్తూ ఉంటే అబ్బాయిల క్రష్ గా మారిపోయినట్లుగా అనిపిస్తోంది.

అసలే ఇండస్ట్రీలో హీరోయిన్స్ కొరత ఎక్కువగా ఉంది. ఇలాంటి సమయంలో ఎక్కువగా ఎట్రాక్ట్ చేస్తుంది కాబట్టి తప్పకుండా భవిష్యత్తులో మరిన్ని ప్రాజెక్టులు అందుకునే అవకాశం అయితే ఉంటుంది.

ఇక ఏజెంట్ సినిమాను ఈ ఏడాది సమ్మర్ లోనే విడుదల చేయాలని అనుకున్నారు. కానీ వివిధ కారణాల వలన షూటింగ్ ఆలస్యం కావడంతో డిసెంబర్ లో సినిమాను విడుదల చేయాలని అనుకుంటున్నారు. అదే సమయంలో విజయ్ దేవరకొండ ఖుషి సినిమా కూడా రాబోతోంది. మరి ఏజెంట్ సినిమాతో సాక్షి వైద్య ఎలాంటి క్రేజ్ అందుకుంటుందో చూడాలి.
Tags:    

Similar News