'సలార్' షూటింగ్ లేటెస్ట్ అప్డేట్..!

Update: 2021-03-17 16:30 GMT
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ - 'కేజీఎఫ్‌' ఫేమ్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో 'సలార్' అనే భారీ యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. హోంబలే ఫిలింస్ బ్యానర్ పై విజయ్‌ కిరగందూర్‌ ఈ పాన్ ఇండియా చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇందులో ప్రభాస్ కి జోడీగా శృతి హాసన్ నటిస్తోంది. ఈ మధ్య తెలంగాణలోని గోదావరిఖని - రామగుండం ప్రాంతాల్లో ఈ సినిమా షూటింగ్ జరిపారు. వచ్చే ఏడాది ఏప్రిల్ లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే తాజా సమాచారం ప్రకారం 'సలార్' తదుపరి షెడ్యూల్ ఏప్రిల్ 20 నుంచి ప్రారంభం కానుందని తెలుస్తోంది.

ప్రస్తుతం ప్రభాస్ ఓం రౌత్ తెరకెక్కిస్తున్న 'ఆదిపురుష్' సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ముంబైలో ఏప్రిల్ మొదటి వారం వరకు ఈ షెడ్యూల్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఇందులో ఓ సాంగ్ తో పాటుగా కొన్ని యాక్షన్ సీన్స్ కూడా చిత్రీకరించనున్నారు. ఇది కంప్లీట్ అయిన తర్వాత 'సలార్' సెకండ్ షెడ్యూల్ గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ లో స్టార్ట్ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారని సమాచారం. ఇక రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న పీరియాడికల్ లవ్ స్టోరీ 'రాధే శ్యామ్' లో ఓ సాంగ్ షూటింగ్ పెండింగ్ ఉందని తెలుస్తోంది. దీని కోసం డార్లింగ్ 6 రోజుకు కేటాయించనున్నాడు. ఈ సినిమాని పాన్ ఇండియా స్థాయిలో జులై 30న విడుదల చేయనున్నారు.


Tags:    

Similar News