కింగ్ ఖాన్ షారూక్.. కండల హీరో సల్మాన్ ఖాన్ కలిసి ఒకే సినిమాలో కనిపించడం అభిమానులకు పెద్ద పండగ లాంటిది. ఆ ఇరువురి అభిమానులు ఏకమైతే రికార్డులతో మోతెక్కిపోవాల్సిందే. అయితే ఇన్నాళ్లు ఆ ఇద్దరూ కేవలం అతిథి పాత్రలతోనే సరిపెట్టుకున్నారు. కానీ ఇక ఓ పూర్తి సినిమాలో ఫుల్ లెంగ్త్ రోల్స్ తో హీట్ పెంచేందుకు సిద్ధమవుతున్నారు. కరణ్ అర్జున్ తర్వాత మళ్లీ చాలా కాలానికి ఇది ఒక సంచలనంగా మారనుందని భావిస్తున్నారు. అంతేకాదు.. ఖాన్ లు ఇరువురితో హృతిక్ రోషన్ ని కలుపుతూ యష్ రాజ్ సంస్థ అసాధారణం అనిపించే యూనివర్శ్ ని నెలకొల్పనుందన్నది తాజా వార్త.
దీనికి అంకురార్పణ చేస్తోంది యష్ రాజ్ ఫిలింస్ అధినేత ఆదిత్య చోప్రా. అతడి మైండ్ లో ఇప్పుడు ఇండస్ట్రీ బిగ్గెస్ట్ స్టార్ హీరోలను కలుపుతూ మార్వల్ తరహా విశ్వాన్ని క్రియేట్ చేయాలన్న ఆలోచన ఫ్లాష్ లా మెరిసింది. ఆదిత్య చోప్రా రాసిన భారతదేశంలోనే అతిపెద్ద యాక్షన్ చిత్రం కోసం సల్మాన్ ఖాన్ - షారూఖ్ ఖాన్ జతకడుతుండడం హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం ఇదే బ్యానర్ లో హృతిక్ రోషన్ హీరోగా మరో గూఢచారి మూవీ `వార్ 2` కూడా రూపొందుతోంది. హృతిక్ రోషన్ కు ఇప్పటికే ఖాన్ లతో కలిపి నటించే యూనివర్శ్ ఐడియాపైనా హింట్ ఉంది. సూపర్ స్టార్ హృతిక్ కూడా వారితో కలుస్తారా? అన్నది ఇప్పుడు మరింత ఎగ్జయిట్ మెంట్ పెంచుతోంది. ఈ ఆలోచనను అతడు ఇష్టపడ్డారనేది టాక్ కూడా ఉంది.
15 ఆగస్ట్ 2012లో సల్మాన్ ఖాన్ `టైగర్`గా బాధ్యతలు చేపట్టారు. ఏక్ థా టైగర్ లో అవినాష్ సింగ్ రాథోడ్ గా కనిపించగా.. అతను 2017లో టైగర్ జిందా హై అనే సీక్వెల్ తో దానిని కొనసాగించాడు. ఈ రెండు చిత్రాలు హిందీ చిత్ర పరిశ్రమలో ఆ సంవత్సరంలో అత్యధిక వసూళ్లు రాబట్టాయి. ఒక సంవత్సరం తర్వాత 2017లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రం అయిన `వార్` లో ఏజెంట్ కబీర్ గా హృతిక్ రోషన్ ప్రభావం చూపాడు. ఇవన్నీ గూఢచారి కాన్సెప్ట్ తో వచ్చిన సినిమాలు. గూఢచర్య రంగంలో వార్ అద్భుతమైన విజయం YRF హెడ్ ఆదిత్య చోప్రా భారతదేశపు తొలి గూఢచారి విశ్వాన్ని సృజించేందుకు సంచలనాత్మక నిర్ణయం తీసుకోవడానికి దారితీసింది.
గణతంత్ర దినోత్సవం 2023 వారాంతంలో షారుఖ్ ఖాన్ ఒక భీకరుడైన ఏజెంట్ గా `పఠాన్`తో వస్తున్నాడు. ఈ మూవీతో విశ్వం మరింత విస్తరిస్తుంది. ఇది టైగర్ ఫ్రాంచైజీ తో మొదటి క్రాస్ ఓవర్ ను కూడా సూచిస్తుంది. సల్మాన్ ఖాన్ పఠాన్ లో పొడిగించిన అతిధి పాత్రలో నటిస్తున్నాడు. ఈద్ 2023లో ప్రారంభమయ్యే `టైగర్ 3`లో పఠాన్ గా అతిధి పాత్రను చేయడం ద్వారా SRK కూడా గూఢచారి విశ్వంలో భాగం అనే సిగ్నల్ ఇచ్చారు. ఇప్పటికి ఇవన్నీ చిన్న పాత్రలు. మునుముందు పెద్ద పాత్రలుగా మారతాయి. కలిసి స్టార్లు భారీ స్పై యాక్షన్ యూనివర్శ్ లో నటిస్తారు.
భవిష్యత్తు లో ఈ యూనివర్శ్ కాన్సెప్ట్ ఎలా ఉంటుంది? అన్నదానికి ఇప్పటికే బాలీవుడ్ మీడియాకు హింట్ అందింది. సల్మాన్ ఖాన్ - షారుఖ్ ఖాన్ భారతీయ సినిమా హిస్టరీలో అతిపెద్ద చిత్రం ఏది? అనే దానికి సమాధానం ఇస్తారు. త్వరలో అలాంటి క్రేజీ ప్రాజెక్ట్ కోసం కలిసి పని చేస్తారని సదరు కథనాలు వెల్లడిస్తున్నాయి.
టైగర్-పఠాన్ లను కలిగి ఉన్న ఇద్దరు హీరోల యాక్షన్ దృశ్యాలను తెరనిండుగా బ్యాక్ టు బ్యాక్ అమర్చడం ద్వారా ఆదిత్య చోప్రా యూనివర్శ్ ని తదుపరి స్థాయికి తీసుకెళ్లాలని యోచిస్తున్నాడు. కరణ్ అర్జున్ (1995) విడుదలైన తర్వాత ఇద్దరు శక్తివంతమైన ఖాన్ లకు ఇది మొదటి కిక్కునిచ్చే ఫ్రాంఛైజీగా మారుతోంది. ఆదిత్య చోప్రా కొంతకాలంగా ఈ ఆలోచనపై పని చేస్తున్నాడు. అతను స్క్రిప్ట్- స్క్రీన్ ప్లే - డైలాగ్ లపై విస్తృతంగా పని చేస్తున్నాడు..! అని సంబంధిత సోర్స్ వెల్లడించింది. ఇంకా పేరు పెట్టని ఎపిక్ టూ హీరో క్రాస్ ఓవర్ ఫ్రాంఛైజీని యష్ రాజ్ ఫిల్మ్స్ బృందం పెద్దగా తీసుకురావాలని భావిస్తున్నట్టు తెలిసింది. 2023 చివరి నాటికి లేదా 2024 మొదటి త్రైమాసికం నాటికి ఈ క్రాస్ ఓవర్ యూనివర్శ్ ప్రారంభమవుతుంది.
దీనికోసం SRK- సల్మాన్ ఇద్దరూ తమ బల్క్ డేట్ లను ఖాళీగా ఉంచారు. ఈ సంవత్సరం చివర్లో బౌండ్ స్క్రిప్టును విన్న తర్వాత కచ్చితమైన లాజిస్టిక్స్ తో ప్రతిదీ లాక్ చేస్తారు. ఇప్పటివరకూ ఈ యూనివర్శ్ కి దర్శకుడు ఎవరో నిర్ణయించలేదు. అయితే రచన విభాగంలో పూర్తి సృజనాత్మక నియంత్రణ YRF అధిపతి ఆదిత్య చోప్రా చేతిలో ఉంది. ప్రస్తుతం అతను ప్రతిదీ వేగంగా పూర్తయ్యేలా తన గ్రిప్ లో ఉంచుకున్నారని తెలుస్తోంది. టైగర్ x పఠాన్ (వర్కింగ్ టైటిల్) మూవీకి స్క్రీన్ ప్లే యష్ రాజ్ స్టూడియోస్ లో కేవలం ముగ్గురికి మాత్రమే తెలుస్తుంది. ఆదిత్య చోప్రా- షారూఖ్ ఖాన్ - సల్మాన్ ఖాన్ లకు మాత్రమే ఈ మూవీ స్క్రీన్ ప్లే గురించి తెలుస్తుంది. ఇతరులకు రివీల్ కాదు.
టైగర్ - పఠాన్ రెండింటి ఫస్ట్ కట్ లాక్ అయిన తర్వాత పూర్తి కథనంపై వర్క్ చేస్తారని భావిస్తున్నారు. పఠాన్ లో దీపికా పదుకొనే -జాన్ అబ్రహం కూడా ప్రధాన పాత్రలు పోషిస్తుండగా.. టైగర్ 3లో కత్రినా కైఫ్- ఇమ్రాన్ హష్మీ కూడా నటించారు. బడ్జెట్ విషయానికొస్తే ఇది భారతీయ సినిమాలో అత్యంత ఖర్చుతో కూడుకున్న చిత్రంగా చర్చల్లో నిలుస్తోంది. భారతీయ సినిమాలోని ఇద్దరు అతిపెద్ద సూపర్ స్టార్లను సాధ్యమైనంత ఉత్తమంగా ప్రదర్శించడం ఎలా అన్నదానిపై ప్రస్తుతానికి ఆదిత్య చోప్రా తీవ్రంగా శ్రమిస్తున్నారు. అతను మైండ్ గేమ్ ని మార్చాడు. భారీ ప్రణాళికలతో సంచలనాత్మక నిర్ణయాలకు సిద్ధంగా ఉన్నాడు అని లీక్ అందింది.
ఇదిలా ఉంటే హృతిక్ రోషన్ ఈ యూనివర్శ్ లో ఎప్పుడు చేరతాడు? అన్నదానికి కూడా చూఛాయగా లీక్ అందింది. హృతిక్ హీరోగా వార్ 2 కూడా త్వరలో రూపొందనుంది. హృతిక్ రోషన్ కి కూడా అంతకుమించి ఒక విషయం ఆదిత్య చోప్రా చెప్పారు. అతను దానిని ఇష్టపడ్డాడు. దానిని మరింత అభివృద్ధి చేయమని యష్ రాజ్ బృందాన్ని కోరాడు. టైగర్ - పఠాన్ ల కనెక్షన్ ఇప్పటికే లాంఛనం. ఇరువురి నడుమ వార్ ఎలా ఉంటుందో చూడాలనే తహతహ అభిమానుల్లో ఉంది.
వీరోచిత గూఢచారుల ప్రపంచంలో హృతిక్ కూడా నెమ్మదిగా కలిసిపోతాడు. వార్ 2 షూటింగ్ టైమ్ లైన్ త్వరలో లాక్ చేసాక దీనిపై మరింత క్లారిటీ వస్తుంది. అయితే ప్రస్తుతానికి పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలియదు కానీ.. వార్ సీక్వెల్ కూడా వచ్చే ఏడాది చివరి నాటికి విడుదలయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇది టైగర్ x పఠాన్ చిత్రానికి భిన్నంగా ఉంటుంది. హృతిక్ ని కూడా క్రాస్ ఓవర్ లో అతిధి పాత్రలో కనిపించినా ఆశ్చర్యపోనక్కర లేదనేది ఒక అంచనా. ఒకరు కాదు ఇద్దరు కాదు ముగ్గురు గూఢచారులు ఒక అసాధారణ మిషన్ కోసం ఏకమయితే అది ఎలా ఉంటుందో తెరపైనే చూడాలి.
ఇద్దరు హీరోల చిత్రంలో సల్మాన్ వర్సెస్ షారూఖ్ కాన్సెప్ట్ ఉంటుందా లేక షారుఖ్ తో కలిసి సల్మాన్ ఆపరేషన్ నడిపిస్తారా? అన్నది కూడా ఆసక్తిని పెంచుతోంది. వీరితో హృతిక్ కలిసేందుకు ఇంకా ఎంత కాలం పడుతుంది? అన్నది ఇప్పటికి సస్పెన్స్. భారతీయ సినిమా అతిపెద్ద విశ్వం (యూనివర్శ్) కి అంకురార్పణ జరిగింది. ఇది మార్వల్ సినిమాల తరహాలోనే అతి భారీ లక్ష్యాలను కలిగి ఉంటుంది. బాక్సాఫీస్ వద్ద పాత రికార్డులను చెరిపేస్తూ సంచలనాలు సృష్టించడం ఖాయమని అంచనా వేస్తున్నారు. ఇది ఉత్తరాదికి సౌత్ విసిరిన అతిపెద్ద ఛాలెంజ్ అని భావించాల్సి ఉంటుందేమో!