మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న హై ఇంటెన్స్ పొలిటికల్ యాక్షన్ డ్రామా ''గాడ్ ఫాదర్''. ఇది మలయాళంలో ఘనవిజయం సాధించిన ‘లూసిఫర్’ చిత్రానికి అధికారిక రీమేక్. చిరు కెరీర్ లో 153వ చిత్రం. ఇందులో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే.
ప్రస్తుతం ''గాడ్ ఫాదర్'' షూటింగ్ ముంబైలో శరవేగంగా జరుగుతోంది. ఇటీవలే సల్మాన్ కూడా టీమ్ తో జాయిన్ అయ్యారు. చిరంజీవి - సల్మాన్ నేపథ్యంలోని కీలకమైన సన్నివేశాలను దర్శకుడు మోహన్ రాజా చిత్రీకరిస్తున్నారు. 'మెమరబుల్ మెగా మూమెంట్స్' పేరుతో సెట్ లో సల్మాన్ ఖాన్ ఉన్న ఫోటోలను చిత్ర యూనిట్ అభిమానులతో షేర్ చేసుకున్నారు.
ఇవి 'గాడ్ ఫాదర్' సెట్ లో భారతదేశపు మోస్ట్ ఫేవరేట్ సల్మాన్ భాయ్ తో మోహన్ రాజా మధుర జ్ఞాపకాలు అని పేర్కొన్నారు. ఒరిజినల్ వెర్సన్ ను డైరెక్ట్ చేసిన పృథ్వీరాజ్ సుకుమారన్ ఆ చిత్రంలో షార్ప్ షూటర్ పాత్రలో నటించారు. ఇపుడు అదే పాత్రని తెలుగులో సల్మాన్ ఖాన్ చేస్తున్నారు.
తాజాగా చిత్ర బృందం వదిలిన ఫొటోలలో సల్మాన్ షూటర్ గెటప్ లోనే కనిపిస్తున్నారు. అతని పాత్ర నిడివి తక్కువే అయినా కథలో కీలకంగా ఉండబోతోంది. చిరంజీవి - సల్మాన్ వంటి ఇద్దరు స్టార్ హీరోలను ఒకే స్క్రీన్ మీద చూడటానికి అభిమానులు ఆతృతగా వేచి చూస్తున్నారు.
'గాడ్ ఫాదర్' చిత్రాన్ని మలయాళం తప్ప మిగిలిన అన్ని ప్రధాన భారతీయ భాషల్లో విడుదల చేయాలని మేకర్స్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. మెగాస్టార్ ఇమేజ్ ను తెలుగు సెన్సిబిలిటీస్ ని దృష్టిలో పెట్టుకొని మాతృక స్క్రిప్టులో పలు మార్పులు చేర్పులు చేశారు.
ఇందులో నయనతార - సత్యదేవ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్ - సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్స్ పై భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఆర్బీ చౌదరి - ఎన్వీ ప్రసాద్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
ఎస్ ఎస్ థమన్ సంగీతం సమకూరుస్తున్నారు. నీరవ్ షా సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. సురేశ్ సెల్వరాజన్ ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నారు. 'గాడ్ ఫాదర్' కు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.