మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఆచార్య సినిమా నిరాశ పర్చింది. అపజయం ఎరగని కొరటాల శివ మొదటి సారి ఆచార్య సినిమా తో అట్టర్ ప్లాప్ అయ్యాడు. ఆ సినిమాలోని ధర్మస్థలి మరియు పాదఘట్టం గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ముఖ్యంగా పాద ఘట్టం ను నెటిజన్స్ కొందరు ఓ రేంజ్ లో ట్రోల్స్ చేస్తూ మీమ్స్ చేయడం జరిగింది.
ఇప్పుడు ఆ పాదఘట్టం మరియు ధర్మస్థలి సెట్ లను బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఉపయోగించబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. ధర్మస్థలి లో సల్మాన్ ఖాన్ ప్రస్తుతం నటిస్తున్న కభీ ఈద్ కభీ దీవాళి సినిమా కు సంబంధించిన కీలక సన్నివేశాల షూటింగ్ ను నిర్వహించబోతున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఆ సినిమాకు తగ్గట్లుగా మార్పులు చేర్పులు చేయించే పనిలో సల్మాన్ టీమ్ ఉన్నారట.
ఇప్పటికే ముంబయిలో ఒక షెడ్యూల్ ను ముగించారు. సినిమాలోని కీలక సన్నివేశాల కోసం ధర్మస్థలి వంటి సెట్టింగ్ సల్మాన్ ఖాన్ కు కావాల్సి ఉందట. అందుకే ధర్మస్థలి ని చిన్న చిన్న మార్పులు చేర్పులు చేయడం ద్వారా తమ సినిమాకు అనుకూలంగా మార్చుకుంటున్నారట. టెంపుల్ సిటీ కోసం భారీగా ఖర్చు చేసి కొరటాల శివ అద్బుతంగా ఆ సెట్టింగ్స్ ను వేయించిన విషయం తెల్సిందే.
ఆచార్య సినిమాలోని ఆర్ట్ వర్క్ కు పాజిటివ్ మార్కులు పడ్డాయి. సినిమా ప్లాప్ అయినా కూడా ధర్మస్థలి సెట్టింగ్ గురించి చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుకుంటున్నారు. కనుక ధర్మస్థలి సెట్టింగ్ లో సల్మాన్ ఖాన్ సినిమా చేయడం వింతేం కాదు. సల్మాన్ ఖాన్ కు మరియు మెగా ఫ్యామిలీకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. కనుక చిరంజీవి సూచన మేరకు ధర్మస్థలిని సల్మాన్ ఉపయోగించుకుంటున్నాడేమో అంటున్నారు.
సల్మాన్ ఖాన్ నటిస్తున్న కభీ ఈద్ కభీ దీవాళి లో హీరోయిన్ గా సౌత్ బ్యూటీ పూజా హెగ్డే నటిస్తున్న విషయం తెల్సిందే. అంతేకాకుండా కీలక పాత్రలో విక్టరీ వెంకటేష్ నటిస్తున్న కారణంగా ఈ సినిమా విషయం లో తెలుగు ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమాను తెలుగులో ఎప్పుడెప్పుడు చూస్తాం అన్నట్లుగా వెయిట్ చేస్తున్నారు. వెంకీ తన వయసుకు తగ్గ పాత్రను ఈ సినిమాలో చేస్తున్నాడట.