భాయ్.. ఈ జంటగా కలవడం ఏంటో?

Update: 2016-08-14 04:15 GMT
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ వరుస విజయాలతో ఊపు కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు. రీసెంట్ గా రిలీజ్ అయిన సుల్తాన్.. సల్మాన్ ను మరో మెట్టు ఎక్కించింది. ఇటు ప్రొఫెషనల్ గా పీక్ స్టేజ్ లో ఉండగానే.. సల్మాన్ ఖాన్ పర్సనల్ గా కూడా ఓ కీలక నిర్ణయం తీసుకోబోతున్నాడనే ప్రచారం గట్టిగానే జరుగుతోంది.

ప్రస్తుతం సల్మాన్ వయసు 50 సంవత్సరాలు. ఇప్పుడు సల్లూ భాయ్ ఓ ఇంటివాడు కాబోతున్నాడనే టాక్ ఉంది. సల్మాన్ ప్రేయసి ఇరానియన్ మోడల్ లూలియా వంతూర్ అనే సంగతి పాతదే. కానీ వీరిద్దరూ కలిసి చక్కర్లు కొట్టడమే హాట్ టాపిక్. ప్రస్తుతం కబీర్ ఖాన్ డైరెక్షన్ లో ట్యూబ్ లైట్ మూవీ చేస్తున్న భాయ్.. లడఖ్ లో షూటింగ్ చేస్తున్నాడు. ఆ సమయంలో అక్కడ దలైలామాను కూడా కలుసుకున్నాడు.

దలైలామా దగ్గరకు సల్మాన్ ఒంటరిగా వెళ్లలేదు. వెంట లూలియాను కూడా తీసుకెళ్లాడు. మీడియా జనాలు దీన్ని లైట్ తీసుకునేవారేమో కానీ.. సల్మాన్ వైపు నుంచి వచ్చిన ఫోటోల్లో ఈమెను కట్ చేసి మీడియాకి అందించారు. ఇది ఉద్దేశ్యపూర్వకంగా చేసిందే కావడంతో.. మరోసారి ఈ జంట వార్తల్లోకి ఎక్కేసింది. సీక్రెట్ గా ఉంచాలని భావిస్తే.. పర్సనల్ మీటింగ్ ఏర్పాటు చేసుకోవచ్చు. కానీ ఇలా జంటగా కలిసేసి.. తీరా తర్వాత ఆమెను తప్పించి ఫోటోలిస్తే.. అప్పుడు ఇలాంటి మాటలే వస్తాయ్ మరి!
Tags:    

Similar News