సల్మాన్ భరించాడు.. మరి మనోళ్ళు?

Update: 2017-08-10 07:30 GMT
మన దేశంలో సినిమా తీసే ఖర్చుకన్నా ఆ సినిమాలో నటించే నటీనటులుకే ఎక్కువ ఇచ్చుకోవలిసి ఉంటుంది. స్టార్ హీరోలు సినిమాలో ఉంటే  ఆ ప్రొడ్యూసర్ కి బ్యాంక్ ఖాతా ఖాళీ అవ్వకతప్పదు. స్టార్ హీరో సినిమాకు విడుదల ముందే మార్కెట్ డీల్ అయిపోవడం వలన కొంత వరకు కొన్ని సినిమాలకు తీవ్ర నష్టాలు ఏమి రావు కానీ కొన్ని సినిమాలపై అంచనాలు తారస్థాయిలో ఉంటాయి. అటువంటి అప్పుడు సినిమా ఏమైనా తేడా చేస్తే ముందు నష్టపోయేది మాత్రం ఖచ్చితంగా ఆ సినిమాను డిస్ట్రిబూటర్ చేసిన వాళ్ళే అనే చెప్పాలి.

ఈ మధ్య విడుదలైన బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ సినిమా ట్యూబ్ లైట్ ఎంత పెద్ద ఫ్లాప్ అయ్యిందో మీకు తెలిసే ఉంటుంది. ఈ సినిమాను నమ్మి సల్మాన్ క్రేజ్ చూసి సినిమా రైట్స్ తీసుకున్న డిస్ర్టిబ్యూటర్లకు తీవ్ర నష్టం వచ్చింది. తండ్రి సలీమ్ ఖాన్ ఆజ్ఞ మేరకు సల్మాన్ తన సినిమా నష్టాన్ని కొంత భరించడానికి సిద్దపడ్డాడు. సల్మాన్ ఖాన్ ఆఫీసు నుండి వెలువడిన వార్త ఏంటంటే “సల్మాన్ ఖాన్ ట్యూబ్ లైట్ వలన డిస్ర్టిబ్యూటర్లకు వచ్చిన నష్టానికి పరిహారంగా జూలై లోనే వాళ్ళకి చెల్లించవలిసింది. కానీ ‘టైగర్ జిందా హై’ సినిమా షూటింగ్ వలన సల్మాన్ విదేశాలలో ఉండవలిసి వచ్చింది. ఇప్పుడు అయన ముంబాయి తిరిగి వచ్చారు కాబట్టి అతను ఇచ్చిన మాట ప్రకారం 32.5 కోట్లు నష్టపరిహారం ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నారు'' అని చెప్పారు. ట్యూబ్ లైట్ సినిమాకు వచ్చిన నష్టంలో ఇది సగభాగం అని మనం అనుకోవచ్చు.

ఇలా సల్మాన్ ఖాన్ సినిమాకే కాదు మన సూపర్ స్టార్లు సినిమాలకు కూడా దారుణంగా విఫలమైన సినిమాలు ఉన్నాయి. కానీ ఆ సూపర్ స్టార్లు ఎవరు సల్మాన్ ఖాన్ లా ముందుకు వచ్చి డిస్ర్టిబ్యూటర్లకు తిరిగి డబ్బులు ఇవ్వలేదు. సౌత్ సూపర్ స్టార్ రజినీకాంత్ ‘కబాలి’ సినిమా కానీ పవన్ కల్యాణ్ ‘కాటమరాయడు’ సినిమా అయినా.. మహేశ్ బాబు ‘బ్రహ్మోత్సవం’ సినిమాకు.. చాలా నష్టాలు వచ్చాయి. కానీ ఏ సూపర్ స్టార్ కూడా ఆ విషయం మాట్లాడింది లేదు తిరిగి డబ్బులు ఇచ్చింది లేదు. సల్మాన్ ఖాన్ ఈ విషయంలో అందరికీ ఆదర్శంగా నిలిచాడు.

మరో విషయం ఏంటంటే సల్మాన్ ఖాన్ సినిమాను డిస్ట్రిబూట్ చేసిన శ్రేయన్ హీరావత్ అనే  డిస్ర్టిబ్యూటర్ షారూక్ ఖాన్ ‘జబ్ హ్యారి మెట్ సెజల్’ సినిమాను కూడా చేసి 50 కోట్లు నష్టపోయాడు అని తెలుస్తుంది. ఇప్పుడు షారూక్ ఖాన్ కూడా సల్మాన్ భాయ్ అడుగుజాడలు లో నడిచి నష్టాన్ని పూరిస్తాడట.
Tags:    

Similar News