బాలీవుడ్ కండల హీరో సల్మాన్ ఖాన్ తో స్నేహం చేస్తే ఎలా ఉంటుందో తన సన్నిహితులు చెబుతుంటారు. భాయ్ తో ఒకసారి స్నేహం చేస్తే ఖతమ్! అతడి వశం అయిపోవాల్సిందే ఎవరైనా. అంతటి గొప్ప మనసు అతడికి మాత్రమే ఉందని తనతో అనుభవం అయిన హీరోలు హీరోయిన్లంతా చెబుతుంటారు. గొప్ప మానవతా హృదయం ఉన్న స్టార్ అంటూ పొగిడేస్తుంటారు.
అంతేకాదు.. తన స్నేహితులైన ఖాన్ లు ఎవరైనా తమ చిత్రాల్లో అతిథి పాత్రను ఆఫర్ చేస్తే దానికి పారితోషికం తీసుకోనని కండీషన్ పెడతాడు భాయ్. బిగ్ బి అమితాబ్ కానీ షారూక్ ఖాన్ కానీ సల్మాన్ ఖాన్ కానీ ఇలాంటి లక్షణాలను కలిగి ఉన్నారు.
రిలేషన్ షిప్ కి అత్యంత ప్రాధాన్యతనిచ్చేస్టార్లు వీరంతా. ఇక టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి స్నేహం కోసం దేనికైనా సిద్ధమని అంటారు. అలాంటిది మెగాస్టార్ చిరంజీవి - సల్మాన్ ఖాన్ కాంబినేషన్ లో సినిమా తెరకెక్కుతోందంటే సన్నివేశం ఎలా ఉంటుందో ఊహించవచ్చు.
తాజాగా మలయాళ బ్లాక్ బస్టర్ లూసిఫర్ ఆధారంగా రూపొందుతున్న`గాడ్ ఫాదర్`లో అతిథి పాత్రలో నటించడానికి సల్మాన్ ఖాన్ వెంటనే అంగీకరించాడు. దాంతో అతని రెమ్యునరేషన్ లో భాగంగా మేకర్స్ భారీ మొత్తాన్ని ఆఫర్ చేశారు. అయితే రెమ్యూనరేషన్ ఇస్తే సినిమాకు సంతకం చేయనని సల్మాన్ ఖాన్ స్పష్టం చేశారు. డబ్బులు తీసుకోకుండా సినిమా చేయాలనే శరతు పెట్టాడు. ఇదంతా దేనికోసం అంటే మెగాస్టార్ చిరంజీవితో తనకు ఉన్న స్నేహం కారణంగానే అనడంలో ఎలాంటి సందేహం లేదు.
మెగాస్టార్ కుటుంబంతో సల్మాన్ భాయ్ కి చాలా ఏళ్లుగా స్నేహం ఉంది. చిరంజీవి అంటే ఆయనకు అమితమైన గౌరవం.. ప్రేమాభిమానాలు. అందుకే సల్మాన్ ఖాన్ ఈ చిత్రం చేయడానికి అంగీకరించాడు. అతని ఉదాత్త హృదయాన్ని చూసి నిర్మాతలు సైతం ఆశ్చర్యపోయారు. నిజానికి భాయ్ అడగాలే కానీ ఎంత ఇచ్చేందుకైనా నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు. కానీ తృణప్రాయంగా భాయ్ త్యజించారు.
సల్మాన్ ఈ చిత్రంలో అతిథి పాత్రలో నటించినా కానీ అది హిందీ మార్కెట్ కి ప్రధాన అస్సెట్ అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఇటీవల మరో స్నేహితుడు షారూక్ ఖాన్ నటిస్తున్న పఠాన్ లో నటించేందుకు కూడా భాయ్ పారితోషికం తీసుకోలేదు. అందులోను అతిథి పాత్రలో మెరవబోతున్నాడు. ఇకపోతే.. షారూక్ ఖాన్ కంటే చిరంజీవి అంటేనే సల్మాన్ భాయ్ కి గౌరవంతో కూడుకున్న ప్రేమ అని అభిమానులు చెబుతున్నారు. ఆ ఇద్దరిదీ అపార ప్రేమ అని పొగిడేస్తున్నారు.