గత కొన్నేళ్లలో తెలుగు సినిమాలకు ఓవర్సీస్ మార్కెట్ బాగా పెరిగింది. యుఎస్ థియేట్రికల్ హక్కులు మన సినిమాలకు మంచి ఆదాయ వనరుగా మారాయి. ఐతే కొన్ని సినిమాలు అక్కడ ఇరగాడేశాయని.. ప్రతి సినిమా మీద యుఎస్ బయ్యర్లు భారీ మొత్తంలో పెట్టుబడి పెట్టేసి బోల్తా కొట్టేస్తున్నారు. ఈ మధ్య కాలంలో అక్కడి బయ్యర్లకు చాలా సినిమాలు చేదు అనుభవాన్ని మిగిల్చాయి. ముఖ్యంగా పెద్ద పెట్టుబడులు పెట్టిన సినిమాలన్నీ దెబ్బ కొట్టేస్తున్నాయి. ఈ నేపథ్యంలో క్రిస్మస్ వీకెండ్ లో రాబోయే రెండు సినిమాలు ఎలాంటి ఫలితాన్నందిస్తాయో అని అక్కడ కంగారు మొదలైంది.
ఇటు నాని సినిమా ‘ఎంసీఏ’ మీద.. అటు అఖిల్ మూవీ ‘హలో’ మీద పెట్టుబడులు భారీగానే పెట్టేశారు. ఐతే వీటి పరిస్థితి ఏమంత ఆశాజనకంగా కనిపించట్లేదు. గత కొన్నేళ్లుగా నాని యుఎస్ మార్కెట్ స్థిరంగా ఉంటున్న మాట వాస్తవమే అయినా.. ‘ఎంసీఏ’ ట్రైలర్ చూస్తే మాత్రం ఈ సినిమా యుఎస్ తెలుగు ఆడియన్స్ టేస్టుకు తగ్గ చిత్రంలా అనిపించలేదు. రొటీన్ స్టఫ్ ఉన్న సినిమాల్ని అక్కడి వాళ్లు ప్రిఫర్ చేయకపోవచ్చు. మరోవైపు అఖిల్ సినిమాకు విక్రమ్ కుమార్ దర్శకుడు కావడం కలిసొచ్చేదే అయినా.. ఈ ట్రైలర్ యాక్షన్ ప్రధానంగా కనిపించడం.. అఖిల్ కు మార్కెట్ లేకపోవడం.. అతడి తొలి సినిమా తేడా కొట్టడం మైనస్ అవుతున్నాయి. ఈ ప్రతికూలతలు చాలవన్నట్లు క్రిస్మస్ వీకెండ్లో సల్మాన్ ఖాన్ సినిమా ‘టైగర్ జిందా హై’ రిలీజవుతోంది. యుఎస్ లో ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో రిలీజ్ చేయబోతున్నారు. డొమెస్టిగ్గా తెలుగు సినిమాలపై దీని ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చు కానీ.. యుఎస్ లో మాత్రం ఎఫెక్ట్ చాలానే ఉంటుంది. ఈ నేపథ్యంలో ‘ఎంసీఏ’.. ‘హలో’ యుఎస్ లో ఎలా పెర్ఫామ్ చేస్తాయో అన్న కంగారు కనిపిస్తోంది. ‘హలో’ సినిమా ఓవర్సీస్ హక్కుల్ని ఏకంగా రూ.3 కోట్లకు అమ్మిన నాగార్జున.. ఇప్పుడు యుఎస్ ప్రేక్షకులకు కనెక్టయ్యేలా క్లాస్ ట్రైలర్ ఒకటి కట్ చేసి రిలీజ్ ముంగిట వదలాలని చూస్తున్నట్లుగా వార్తలొస్తున్నాయి.