కరోనా కారణంగా తెలుగు మరియు తమిళ బిగ్ బాస్ కాస్త ఆలస్యం అవుతున్నాయి. వచ్చే నెలలో లేదా సెప్టెంబర్ మొదటి వారాల్లో షో ప్రారంభం అయ్యే అవకాశం ఉందంటున్నారు. ఇదే సమయంలో హిందీ బిగ్ బాస్ సీజన్ 14 కు కూడా సన్నాహాలు దాదాపుగా పూర్తి అయ్యాయి. సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో ఈ కొత్త సీజన్ ప్రారంభం కాబోతుంది. గత కొన్ని సంవత్సరాలుగా హోస్ట్ గా వ్యవహరిస్తున్న సల్మాన్ ఈ సీజన్ కు కూడా హోస్టింగ్ చేయబోతున్నాడు.
ప్రస్తుతం కరోనా భయం ఉన్న కారణంగా సల్మాన్ గత మూడు నాలుగు నెలలుగా ముంబయికి చాలా దూరంగా ఉండే తన పన్వెల్ ఫామ్ హౌస్ లోనే ఉంటున్నాడు. అక్కడే తన కుటుంబ సభ్యులను మరియు స్నేహితులను పెట్టుకుని ఈ టైం ను ఎంజాయ్ చేస్తున్నాడు. ఒక వైపు తన ఫామ్ హౌస్ లో వ్యవసాయం చేయడంతో పాటు మరో వైపు తన ఫామ్ హౌస్ లోనే షూటింగ్స్ కూడా చేస్తున్నాడు. ఇక బిగ్ బాస్ కొత్త సీజన్ ప్రారంభం అయితే అక్కడ నుండే హోస్టింగ్ చేస్తానంటూ సల్మాన్ కండీషన్ పెట్టాడట.
బిగ్ బాస్ కు వస్తున్న రేటింగ్స్ నేపథ్యంలో సల్మాన్ అన్ని డిమాండ్స్ కు నిర్వాహకులు ఏమాత్రం వెనుకంజ వేయడం లేదు. ఆయన డిమాండ్ చేసిన పారితోషికం ఇవ్వడంతో పాటు ఇప్పుడు ఆయన అడిగినట్లుగా పన్వెల్ ఫామ్ హౌస్ లోనే ఆయన హోస్టింగ్ చేసేందుకు వీలు కల్పిస్తూ సెట్ ను ఏర్పాటు చేసేందుకు సిద్దం అయ్యారు. ఈసారి చాలా ప్రత్యేకంగా షో ఉంటుందని నిర్వాహకులు అంటున్నారు. కరోనా ప్రభావంతో టాస్క్ ల విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలనుకుంటున్నారు.