గత కొన్నేళ్లలో ఇంతింతై అన్నట్లు ఎదిగిపోయాడు బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్. ఒకప్పుడు ఖాన్ త్రయంలో అతడిది చివరి స్థానం. కానీ ఇప్పుడతను అమీర్ ఖాన్ కు గట్టి పోటీ ఇస్తున్నాడు. షారుఖ్ ఖాన్ ను మూడో స్థానానికి నెట్టేసి.. అమీర్ ఖాన్ బాక్సాఫీస్ రికార్డులకు చేరువగా వెళ్తున్నాడు సల్మాన్. గత ఏడాది వచ్చిన ‘సుల్తాన్’.. అంతకుముందు ఏడాది రిలీజైన ‘భజరంగి భాయిజాన్’ భారీ వసూళ్లు సాధించాయి. సల్మాన్ కొత్త సినిమా ‘ట్యూబ్ లైట్’ ఈ రెంటి వసూళ్లను దాటేస్తుందని అంచనా వేస్తున్నారు. సల్మాన్ తో ఇంతకుముందు ‘ఏక్ థా టైగర్’.. ‘భజరంగి భాయిజాన్’ లాంటి సూపర్ హిట్లు తీసిన కబీర్ ఖాన్ ఈ చిత్రాన్ని రూపొందిస్తుండటం విశేషం.
ప్రతి ఏడాదీ రంజాన్ పండగకు తన సినిమా రిలీజయ్యేలా చూసుకునే సల్మాన్.. ఈసారి కూడా ఈద్ మీదే ఫోకస్ పెట్టాడు. రంజాన్ కానుకగా జూన్ 23న ఈ చిత్రం విడుదల కానున్నట్లు ప్రకటించారు. ఈ చిత్రాన్ని స్వయంగా సల్మాన్ ఖానే నిర్మించడం విశేషం. మరో ఆసక్తికర కబురు ఏంటంటే.. ‘ట్యూబ్ లైట్’ ఆడియో హక్కుల్ని ఏకంగా రూ.20 కోట్లకు అమ్మారట. ఇది ఇండియాలో రికార్డు. ఐతే ఈ చిత్రంలో ఆరేడు పాటలేమీ ఉండవు. ఆడియో కేవలం మూడు పాటలకే పరిమితం. ఆ మూడు పాటల హక్కులకే రూ.20 కోట్లు చెల్లించిందట ఓ ఆడియో సంస్థ. ఇది సల్మాన్ స్టామినాకు నిదర్శనం అంటూ అభిమానులు పొంగిపోతున్నారు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ప్రీతమ్ ఈ చిత్రానికి సంగీతాన్నందిస్తున్నాడు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/