కరోనా బాధితులకు అండగా సల్మాన్ ఖాన్

Update: 2020-03-31 13:30 GMT
క‌రోనా ప్ర‌భావంతో యావ‌త్ ప్ర‌పంచం వ‌ణికిపోతోంది, 198 దేశాల‌కు ఈ వైర‌స్ పాకేసింది. పెద్ద ఎత్తున దీనికై విరాళాలు సేక‌రించి పేద‌ల‌కు ఆప‌న్న‌హ‌స్తం అందిస్తున్నారు. ఈ స‌మ‌యంలో మ‌న దేశంలో కూడా విరాళాలు అంద‌చేస్తున్నారు. పీఎం స‌హ‌య‌నిధికి పెద్ద ఎత్తున విరాళాలు అందిస్తున్నారు. ఈ ప్ర‌భావం సినిమా ప‌రిశ్ర‌మ‌పై చాలా ఎక్కువ‌గా ఉంది, ఏ ప‌నిలేక ఇబ్బంది ప‌డుతున్న వారు చాలా మంది ఉన్నారు. సినిమా షూటింగ్స్‌ పై ఆధారపడుతున్న రోజువారీ సినీ కార్మికులు, వారి కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు, బాధితులకు అండగా నిలువడంలో సల్మాన్ ఖాన్ ఎప్పుడూ ముందుంటారనే పేరుంది. ఆయన స్వచ్చంద సంస్థ బీయింగ్ హ్యూమన్ పేరుతో విరాళాలు - ఆర్థిక సహాయం - వైద్య పరీక్షలు జరిపిస్తుంటారు.

తాజాగా కరోనావైరస్ కారణంగా లాక్‌డౌన్ ప్రకటించిన నేపథ్యంలో సినీ పరిశ్రమ కార్యకలాపాలు స్తంభించాయి. ఈ కారణంగా రోజువారీ వేతన కార్మికుల పరిస్థితి దయనీయంగా మారింది. ఈ క్రమంలో వారిని ఆదుకొనేందుకు సల్మాన్ ఖాన్ ముందుకు వచ్చారు. ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియన్ సినీ ఎంప్లాయిస్‌కు తన వంతు సాయాన్ని అందించడానికి ముందుకు వచ్చారు బాలీవుడ్ అగ్ర కథానాయకుడు సల్మాన్ ఖాన్‌. స‌ల్మాన్ కు సంబంధించిన బీయింగ్ హ్యుమన్ ఫౌండేషన్ ద్వారా 25 వేల మంది కార్మికులకు సంబంధించిన బాగోగులను చూసుకోనున్నారు. సదరు కార్మికుల ఖాతాల్లోనే నేరుగా డబ్బులు జమ చేసేలా ఏర్పాటు చేస్తున్నారు సల్మాన్‌ ఖాన్.


Tags:    

Similar News