క్రిప్టోకి సామ్ ప్ర‌చారం.. ఎంపిక‌ స‌రైన‌దేనా?

Update: 2022-01-26 05:48 GMT
స‌మంత లైఫ్ జ‌ర్నీ కెరీర్ దూకుడుపై అభిమానుల‌కు పూర్తి అవ‌గాహ‌న ఉంది. ఇటీవ‌ల కొన్ని వ్యక్తిగ‌త ఒడిదుడుకులు ఉన్నా.. కెరీర్ మ‌రింత వేగం పుంజుకున్న సంగ‌తి తెలిసిందే. టాలీవుడ్ క‌మింట్ మెంట్ల‌తో పాటు బాలీవుడ్ లోనూ బిజీ అయ్యే ప్ర‌య‌త్నాల్లో ఉంది. అటు  బ్రాండ్ అంబాసిడ‌ర్ గాను సామ్ స్పీడ్ కి తిరుగులేదు. అర్బ‌న్ కిసాన్..సాకీ లాంటి ప‌లు సంస్థ‌ల‌కు ప్ర‌చార‌క‌ర్త‌గా వ్య‌వ‌హ‌రిస్తోంది. ఈ నేప‌థ్యంలో సామ్ ఖాతాలో మ‌రో కార్పొరెట్ సంస్థ చేరింది.

క్రిప్టో క‌రోన్సీ ప్ర‌చారంలో సమంత కూడా భాగ‌మైంది. కాయిన్ స్విచ్ కుబేర్ క్రిప్టో కి స‌మంత ప్ర‌చార క‌ర్త‌గా నియ‌మితులైంద‌ని స‌మాచారం. దానికి సంబంధించిన ఓ వీడియోని త‌న  జిమ్ సెష‌న్ నుంచి రిలీజ్ చేసింది. 100 రూపాయ‌ల నుంచి క్రిప్టోపై ఇన్వెస్ట్ చేయొచ్చ‌ని స‌మంత తెలిపింది.

అలాగే క్రిప్టో పై సందేహాల్ని కాయిన్ స్విచ్ కుబేర్ నివృత్తి చేస్తుంద‌ని వీడియోలో తెలిపింది. ఇప్ప‌టికే ప‌లు క్రిప్టో క‌రెన్సీ ప్లాట్ ఫామ్ లకు బాలీవుడ్ న‌టులు ఆయుష్మాన్ ఖురానా... ర‌ణ‌వీర్ సింగ్ లాంటి దిగ్గ‌జాలు భార‌త్ లో ప్ర‌చార క‌ర్త‌లుగా ఉన్నారు.  తాజాగా స‌మంత కూడా వాళ్ల స‌ర‌స‌న చేర‌డం విశేషం.  ఇప్ప‌టికే భార‌త్ లో వజీర్ ఎక్స్...కాయిన్ డీసీఎక్స్..కాయిన్ స్విచ్  కుబేర్ లాంటి క్రిప్టోక‌రెన్సీ ప్లాట్ ఫామ్స్ అందుబాటులో ఉన్నాయి. ఓ వైపు వీటి నియంత్ర‌ణ కోసం ప్ర‌భుత్వం ఎన్ని చ‌ర్య‌లు తీసుకున్నా ఆద‌ర‌ణ మాత్రం త‌గ్గ‌లేదు. ప్ర‌భుత్వం క్రిప్టో విష‌యంలో కొత్త పాల‌సీ తీసుకొస్తుంద‌ని ప్ర‌క‌టించాక క్రిప్టో క‌రెన్సీ కొనుగోళ్ల‌పై ప్ర‌భావం ప‌డింద‌ని 50శాతం డిప్ కొన‌సాగింద‌ని ప్ర‌చార‌మైంది. అయితే దీనిపై ట్రేడ్ నిపుణులు విశ్లేషించాల్సి ఉంటుంది. రిస్కీ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేప్పుడు చాలా సంగ‌తుల్ని విశ్లేషించాకే పెట్టుబ‌డుల్ని పెట్టాల్సి ఉంటుంది. ఇక సెల‌బ్రిటీ ప్ర‌చారంతో ప్ర‌జ‌లు ఎక్కువ ప్ర‌భావితం అవుతారు. వీళ్ల బ్రాండ్ ఎంపిక స‌రైన‌దేనా కాదా? అన్న‌ది ప‌రిశీలించ‌ద‌గిన‌ది.

ఇక స‌మంత సినిమాల విష‌యానికి వ‌స్తే ఇటీవ‌లే `శాకుంతలం` షూటింగ్ పూర్తిచేసింది. అలాగే మ‌రో లేడీ ఓరియేంటెడ్ చిత్రం `య‌శోద` చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్లింది. ఈ సినిమా మొద‌టి షెడ్యూల్  కూడా పూర్త‌యింది. తెలుగు..త‌మిళ్ లో ఈ చిత్రాన్ని  తెర‌కెక్కిస్తున్నారు. క‌న్న‌డ‌..మ‌ల‌యాళ..హిందీ భాష‌ల్లో కూడా రిలీజ్ చేయ‌నున్నారు. అలాగే కోలీవుడ్ లో విజ‌య్ సేతుప‌తి స‌ర‌స‌న `క‌థువ‌కుల రెండు కాద‌ల్` అనే సినిమాలోనూ న‌టిస్తోంది. `అరేంజ్ మెంట్స్ ఆఫ్ ల‌వ్` అనే విదేశీ చిత్రంలోనూ న‌టిస్తుంది.






Tags:    

Similar News