సామ్ ఓవ‌ర్ కాన్షిడెన్స్ తో రిస్క్ చేస్తోందా?

Update: 2022-10-13 02:30 GMT
గౌత‌మ్ మీన‌న్ తెర‌కెక్కించిన రొమాంటిక్ ల‌వ్ స్టోరీ 'ఏమాయ చేసావే' మూవీతో ప‌రిచ‌య‌మైన స‌మంత హీరోయిన్ గా త‌న‌దైన మార్కు న‌ట‌న‌తో మెస్మ‌రైజ్ చేసేసింది. తొలి మూవీతోనే జెస్సీగా క‌నిపించి తెలుగు ప్రేక్ష‌కుల్ని త‌న మాయ‌లో ప‌డేసింది. హ‌స్కీ వాయిస్ తో సామ్ ఈ మూవీలో మాట్లాడిన ప్ర‌తీ మాట ప్రేక్ష‌కుల్ని హ‌త్తుకుంది. దీంతో అంతా సామ్ ని ఓన్ చేసుకుని క్రేజీ స్టార్ ని చేసేశారు. అయితే ఆ వాయిస్ త‌న‌ది కాదు.. సింగ‌ర్ చిన్మ‌యిది అన్న‌ది తెలిసిందే.

సామ్ బాడీ లాంగ్వేజ్ కి, చిన్మ‌యి స్వ‌రం యాడ‌వ్వ‌డంతో గ‌త కొన్నేళ్లుగా తెలుగు, త‌మిళ ప్రేక్ష‌కుల్ని స‌మంత మెస్మ‌రైజ్ చేస్తూ వ‌స్తోంది. అయితే తాజాగా 'మ‌హాన‌టి' నుంచి చిన్న చిన్న‌గా చిన్మ‌యిని అవాయిడ్ చేస్తూ త‌న స్వ‌రాన్నే వినిపిస్తూ వ‌స్తోంది. కానీ పూర్తి స్థాయిలో మాత్రం త‌న స్వ‌రంతో తెలుగు ప్రేక్ష‌కుల్ని మెస్మ‌రైజ్ చేయ‌లేక‌పోతోంది. దీంతో సామ్ .. చిన్మ‌యిని ఎందుకు దూరం పెడుతోంద‌ని చర్చించుకుంటున్నారు.

ఇద్ద‌రి మ‌ద్య దూరం పెర‌గ‌డానికి కార‌ణం ఏంట‌న్న‌ది మాత్రం ఇంత వ‌రకు బ‌య‌టికి రాలేదు. ఇదిలా వుంటే 'య‌శోద‌' మేక‌ర్స్ మాత్రం స‌మంత‌కు చిన్మయి చేత డ‌బ్బింగ్ చెప్పించాల‌ని చూస్తున్నార‌ట‌. సామ్ మాత్రం లేదు లేదు తానే చెబుతానంటోంద‌ట‌.

ఆ కార‌ణంగానే 'య‌శోద' రిలీజ్ డిలే అవుతున్న‌ట్టుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇటీవ‌లే హెల్త్ స‌మస్య‌ల కార‌ణంగా స‌మంత సీక్రెట్ గా యుఎస్ వెళ్లి తిరిగి వ‌చ్చేసింది.

హైద‌రాబాద్ తిరిగి వ‌చ్చిన స‌మంత అర్జంట్ గా 'య‌శోద‌' డ‌బ్బింగ్ ప‌నులు పూర్తి చేస్తాన‌ని చిత్ర బృందానికి చెప్పేసింద‌ట‌. మేక‌ర్స్ మాత్రం చిన్మ‌యి తో చెప్పించాల‌ని ప‌ట్టుబ‌డుతుంటే త‌ను వ‌ద్ద‌ని త‌న పాత్ర‌కు తానే డ‌బ్బింగ్ చెప్పుకుంటాన‌ని సామ్ ప‌ట్టుబ‌డుతోంద‌ట‌.

మేక‌ర్స్ మాట ప‌క్క‌న పెట్టి స‌మంత కెరీర్ తో ఎందుకు రిస్క్ చేస్తోంద‌ని, ఓవ‌ర్ కాన్ఫిడెన్స్ అవ‌స‌ర‌మా? అని నెటిజ‌న్ లు, ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నార‌ట‌.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News